ఆ నలుగురు కరువై.. తోపుడు బండిలో అంతిమయాత్ర..

| Edited By:

Jul 19, 2020 | 4:22 AM

కరోనా మహమ్మారి కారణంతో బంధాలు దూరమవుతున్నాయి. ఒక్కోసారి కనీసం సొంత కుటుంబీకులను కూడా కడచూపు నోచుకోలేకపోతున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్నో హృదయవిదారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక..

ఆ నలుగురు కరువై.. తోపుడు బండిలో అంతిమయాత్ర..
Follow us on

కరోనా మహమ్మారి కారణంతో బంధాలు దూరమవుతున్నాయి. ఒక్కోసారి కనీసం సొంత కుటుంబీకులను కూడా కడచూపు నోచుకోలేకపోతున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్నో హృదయవిదారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కరోనా బారినపడి మరణించిన వారి పరిస్థితే కాదు.. కరోనా లక్షణాలతో అస్వస్థతకు గురై చనిపోయినా.. కనీసం బంధువులు కూడా చూసేందుకు రావడం లేదు. ఇంతటి దారుణ పరిస్థితులను తీసుకొచ్చింది కరోనా మహమ్మారి. మానవత్వం అన్న పదానికి కరోనా అడ్డంకిగా మారుతోంది అనేక సంఘటనల్లో.

తాజాగా కర్ణాటకలో ఇలాంటి సంఘటనే వెలుగుచూసింది. బెలగావి జిల్లాలోని అథాని ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యక్తి మరణించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు వారి బంధువులతో పాటు.. చుట్టుపక్కల వారందరికీ సమాచారం ఇచ్చారు. అయితే కరోనా భయంతో ఎవరు కూడా రాలేదు. అయితే చుట్టుపక్కల వారిని అంతిమ సంస్కారాలకు సహకరించాలని వేడుకున్నప్పటికీ.. కరోనాతో మరణించాడేమోనన్న అనుమానంతో ఎవరు కూడా అడుగుముందుకు వేయలేదు. దీంతో చేసేదేమీ లేక.. ఓ తోపుడు బండిలో మృతదేహాన్ని పెట్టి.. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు చేపట్టారు.