వ్యాక్సిన్ పై నమ్మకం తెచ్చేందుకే… బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటా: అమెరికా అధ్యక్షుడు బైడెన్…

| Edited By: Venkata Narayana

Dec 05, 2020 | 3:07 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా సైతం వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాల్లో మొదటి స్థానంలో ఉంది.

వ్యాక్సిన్ పై నమ్మకం తెచ్చేందుకే... బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటా: అమెరికా అధ్యక్షుడు  బైడెన్...
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా సైతం వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాల్లో మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పై ప్రజలకు భరోసా, విశ్వాసం కల్పించేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బుష్, క్లింటన్ వంటి వారు తాము బహిరంగంగానే టీకా వేయించుకుంటామని ప్రకటించారు.

కొత్తగా ఎన్నికైన జో బైడెన్….

కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్న జో బైడెన్… వ్యాక్సిన్ ను తాను బహిరంగంగానే తీసుకుంటానని ప్రకటించారు. కాగా, పాలకులకు ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. కాగా, అమెరికాలో కరోనా తీవ్రత పెరిగిపోతూ ఉంది. రోజు దాదాపు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2 వేల మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా నియంత్రణకు నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్నామని అమెరికా అధికారులు సైతం అంటున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న స్థితి కొనసాగినట్లైయితే రానున్న రోజుల్లో కరోనా మరణాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని అమెరికా అధికారులు తెలుపుతున్నారు.