వ్యాక్సిన్‌ దొరికిందోచ్‌.. సంచలన ప్రకటన చేసిన ఇటలీ..!

| Edited By:

May 06, 2020 | 4:45 PM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 37 లక్షలకు పైగా చేరగా.. వీరిలో పన్నెండు లక్షల మందికి పైగా కరోనా బారినుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్జార్జ్ అయ్యారు. ఇక మరో రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలను ఇది టచ్‌ చేసింది. దీనికి విరుగుడు మందు లేకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే దీనికి […]

వ్యాక్సిన్‌ దొరికిందోచ్‌.. సంచలన ప్రకటన చేసిన ఇటలీ..!
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 37 లక్షలకు పైగా చేరగా.. వీరిలో పన్నెండు లక్షల మందికి పైగా కరోనా బారినుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్జార్జ్ అయ్యారు. ఇక మరో రెండున్నర లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలను ఇది టచ్‌ చేసింది. దీనికి విరుగుడు మందు లేకపోవడంతో.. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే దీనికి వ్యాక్సిన్‌ కనుగొనేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్‌ చేస్తుండగా.. తాజాగా ఇటలీ సంచలన ప్రకటన చేసింది. యూరప్‌ దేశాల్లో ఒకటైన ఇటలీ.. కరోనా ప్రభావంతో వేల మంది ప్రజల ప్రాణాల్ని కోల్పోయింది. అంతేకాదు ఇప్పటికీ లక్షల మంది కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసినట్ల ఇటలీ సర్కార్ ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారిగా మనుషులపై పనిచేసే కరోనా వ్యాక్సిన్‌ను డెవలప్ చేసినట్లు ప్రకటించింది.

రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో జరిపిన టెస్టుల్లో.. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకల్లో యాంటీబాడీలను ప్రోడ్యూస్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యాక్సిన్‌ మానవ కణాలపైనా సమర్ధవంతంగా పనిచేస్తుందని ఇటలీ సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ కోసం జరుగుతున్న పరీక్షల్లో ఇది ముందడుగని..ఈ వ్యాక్సిన్‌ను డెవలప్‌ చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో అన్నారు. ఈ ఎండాకాలం తర్వాత మనుషులపై టెస్టులు జరిపే అవకాశం ఉందన్నారు. ఇక ఇటలీతో పాటు.. మరి కొన్ని దేశాలు కూడా వ్యాక్సిన్‌ కనుగొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.