స్వాతంత్రం వచ్చాక ఆ ఊరికి తొలిసారిగా ఎమ్మెల్యే

|

Apr 11, 2020 | 3:47 PM

ఒకప్పుడు ఆ ఊరు రెండు జిల్లాల ప్రాంతాలకు సరిహద్దు. ఇప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల చిట్టచివరి గ్రామం … అయితే దశాబ్దాలు గడుస్తున్నా,  స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఆ కొండ రెడ్డి గిరిజన గ్రామాన్ని ఏ ప్రజా ప్రతినిధి సందర్శించకపోవడం శోచనీయం. అటువంటి గిరిజన గ్రామాన్ని వాగులు వంకలు దాటుతూ కొండలు గుట్టలు ఎక్కుతూ సాహసోపేతం చేసి మారుమూల గ్రామానికి వెళ్లినా ఏకైక ఆదివాసి ఎమ్మెల్యే, గిరి పుత్రుడు తెల్లం బాలరాజు. […]

స్వాతంత్రం వచ్చాక ఆ ఊరికి తొలిసారిగా ఎమ్మెల్యే
Follow us on
ఒకప్పుడు ఆ ఊరు రెండు జిల్లాల ప్రాంతాలకు సరిహద్దు. ఇప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల చిట్టచివరి గ్రామం … అయితే దశాబ్దాలు గడుస్తున్నా,  స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు అయినప్పటికీ ఇంతవరకు ఆ కొండ రెడ్డి గిరిజన గ్రామాన్ని ఏ ప్రజా ప్రతినిధి సందర్శించకపోవడం శోచనీయం. అటువంటి గిరిజన గ్రామాన్ని వాగులు వంకలు దాటుతూ కొండలు గుట్టలు ఎక్కుతూ సాహసోపేతం చేసి మారుమూల గ్రామానికి వెళ్లినా ఏకైక ఆదివాసి ఎమ్మెల్యే, గిరి పుత్రుడు తెల్లం బాలరాజు.
క‌రోనా నేప‌థ్యంలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ఖమ్మం జిల్లా సరిహద్దు లో ఉన్నటువంటి మొదేలు గిరిజన గ్రామాన్నిఎమ్మెల్యేగా బాల‌రాజు సంద‌ర్శించారు. సబ్ కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆర్ వి సూర్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బుట్టాయిగూడెం సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ ఆరేటి సత్యనారాయణ ,మహిళ నాయకురాలు దువ్వెల సృజన తో కలిసి ఆ గ్రామంలో ప‌ర్య‌టించారు. ముందుగా గ్రామస్తులు, చిన్న పిల్లలతో మమేకమై కాసేపు మాట్లాడారు. అనంతరం వారికి మాస్కులు కూరగాయల కిట్లు పంపిణీ చేశారు.