Corona again : కరోనా మళ్లీ విజృంభిస్తోందా..? పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో ఆందోళన కలిగిస్తున్న కొత్త కేసులు

|

Feb 20, 2021 | 3:47 PM

కరోనా మళ్లీ విజృంభిస్తోందా..? వ్యాక్సిన్ వచ్చేసిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో... మళ్లీ కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడాది గ్యాప్‌ తర్వాత పాఠశాలలు..

Corona again : కరోనా మళ్లీ విజృంభిస్తోందా..? పాఠశాలలు తెరిచిన నేపథ్యంలో ఆందోళన కలిగిస్తున్న కొత్త కేసులు
Follow us on

కరోనా మళ్లీ విజృంభిస్తోందా..? వ్యాక్సిన్ వచ్చేసిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో… మళ్లీ కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏడాది గ్యాప్‌ తర్వాత పాఠశాలలు ఈ మధ్యనే పునః ప్రారంభమయ్యాయి. పాఠశాలల్లోనూ పాజిటీవ్‌ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థికి కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. గురువారం పాఠశాలకు చెందిన 26 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరికి కరోనా ఉన్నట్టు తేలింది. విద్యార్థికి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే.. 10 రోజుల క్రితం ఇదే పాఠశాల ప్రిన్సిపాల్‌కు కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన క్వారెంటైన్‌లో ఉంటున్నారు. తర్వాత హాస్టల్‌లో పనిచేసే ఓ వార్డెన్‌కు కూడా కొవిడ్‌ సోకినట్టు వార్తలొచ్చాయి. తాజాగా, మరో విద్యార్ధికి కూడా కరోనా నిర్ధారణ కావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాజిటీవ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాల పరిసరాలు శానిటైజ్ అధికారులు చేస్తున్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read also : ఒక వారంలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయండి లేదా రాజీనామా చేసి వెళ్లండి: జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్