రాజకీయ నేతలకు కరోనా… మొన్న హెల్త్ మినిస్టర్‌కు.. నేడు వైస్ ప్రెసిడెంట్‌కు..

| Edited By:

Feb 28, 2020 | 12:38 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. దాదాపు ముప్పై దేశాలు దీని బారినపడ్డాయి. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. గజగజ వణుకుతున్నాయి దేశాలు. తాజాగా ఇరాన్‌లో ఏకంగా పలువురు కీలక నేతలకే కరోనా పాజిటివ్ తేలడం.. అక్కడి అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇరాన్ వైస్‌ ప్రెసిడెంట్‌ (మహిళా, కుటుంబ వ్యవహారాలు) మసౌమె ఎబ్తెకర్‌కు.. కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె సలహాదారు ఫరీబా మీడియాతో […]

రాజకీయ నేతలకు కరోనా... మొన్న హెల్త్ మినిస్టర్‌కు.. నేడు వైస్ ప్రెసిడెంట్‌కు..
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్‌.. దాదాపు ముప్పై దేశాలు దీని బారినపడ్డాయి. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. గజగజ వణుకుతున్నాయి దేశాలు. తాజాగా ఇరాన్‌లో ఏకంగా పలువురు కీలక నేతలకే కరోనా పాజిటివ్ తేలడం.. అక్కడి అధికారులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇరాన్ వైస్‌ ప్రెసిడెంట్‌ (మహిళా, కుటుంబ వ్యవహారాలు) మసౌమె ఎబ్తెకర్‌కు.. కరోనా పాజిటివ్ అని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆమె సలహాదారు ఫరీబా మీడియాతో వివరాలను తెలిపారు. మసౌమె అనారోగ్యంతో ఉండటంతో.. పరీక్షలు నిర్వహించగా కరోనా సొకినట్లు తేలిందన్నారు. ఆమెతో ఉండే సిబ్బందికి కూడా ఈ పరీక్షలు నిర్వహించారని.. అయితే వారందరి ఫలితాలు శనివారం వెలువడుతాయన్నారు.

ఇదిలా ఉంటే.. గత నాలుగు రోజుల క్రితమే.. ఆ దేశ ఆరోగ్యశాఖ సహాయ మంత్రికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. ఇరాన్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడి 26 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 240 మందికి పైగా .. ఈ వైరస్‌తో పోరాడుతున్నట్లు తెలిపారు.