India Coronavirus Updates: దేశంలో కొత్తగా 13వేల కేసులు నమోదు, మొత్తం కోటి దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

|

Jan 20, 2021 | 10:33 AM

దేశంలో కరోనా కేసుల నమోదు నిలకడగా సాగుతుంది. గత 24 గంటల్లో 13,823 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660కు..

India Coronavirus Updates: దేశంలో కొత్తగా 13వేల కేసులు నమోదు, మొత్తం కోటి దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య
Corona Cases in Maharashtra
Follow us on

India Coronavirus Updates:దేశంలో కరోనా కేసుల నమోదు నిలకడగా సాగుతుంది. గత 24 గంటల్లో 13,823 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,95,660కు చేరుకున్నాయి. వీటిలో 1,97,201 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఒక్క రోజులోనే 16,988 మంది ప్రాణాంతక వైరస్‌ బారినుంచి కోలుకు బయటపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా 1,02,45,741 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 162 మంది కోవిడ్ తో మరణించారు దీంతో ఇప్పటి వరకూ ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,52,718 లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,94,977 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 50,523 మంది చనిపోయారు. ఇక, 9,33,077 కేసులతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓ వైపు కరోనా వైరస్ నివారణ కోసం టీకా తొలి దశ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

Also Read: NEET 2021: నీట్‌ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర విద్యాశాఖ.. ఈ సారి ప్రశ్నపత్రంలో ఆ అవకాశం..