దేశంలో కరోనా విలయం.. రికార్డు స్థాయిలో కొత్తగా 38,902 కేసులు..

| Edited By:

Jul 19, 2020 | 10:00 AM

భారత్‌లో కరోనా వీర‌విహారం చేస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం కరోనా కేసులు సంఖ్య 10 లక్షలు..

దేశంలో కరోనా విలయం.. రికార్డు స్థాయిలో కొత్తగా 38,902 కేసులు..
Follow us on

భారత్‌లో కరోనా వీర‌విహారం చేస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం కరోనా కేసులు సంఖ్య 10 లక్షలు దాటింది. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 38,902 కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వగా, 543 మంది కోవిడ్ కార‌ణంగా మరణించారు. కాగా దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618గా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో 3,73,379 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక వ్యాధి నుంచి కోలుకుని 6,77,423 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశం మొత్తం కరోనాతో మృతుల సంఖ్య 26,816కి చేరుకుంది.

ఇండియాలో రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. మహారాష్ట్రలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. అక్క‌డ‌ మొత్తం కేసుల సంఖ్య 3,00,937కి చేరింది. అలాగే 11,596 మంది వైర‌స్ కారణంగా చ‌నిపోయారు. కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తాజాగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 కేసులు 1,65,714 నమోదవ్వగా, 2,403 మంది మరణించారు. ఢిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,21,582గా ఉంది. మొత్తంగా ఇప్పటివరకూ 3,597 మంది ప్రాణ‌లు విడిచారు.