డేంజ‌ర్ బెల్స్ః భయం గొలుపుతున్నకరోనా…తాజా పరిశోధనలు

|

Apr 17, 2020 | 11:10 AM

వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. వైర‌స్‌కి సంబంధించి శాస్త్ర‌వేత్త‌ల తాజాగా అధ్య‌య‌నం భార‌త్‌కు వ‌ణుకు పుట్టిస్తోంది..

డేంజ‌ర్ బెల్స్ః భయం గొలుపుతున్నకరోనా...తాజా పరిశోధనలు
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతోంది. అన్ని దేశాలకూ విస్తరించిన ఈ వైరస్‌తో లక్షలాదిగా బాధితులవుతున్నారు. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకూ 1.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 22 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. కోవిడ్-19కు అడ్డుకట్టవేయడానికి పలు దేశాల్లో లాక్‌డౌన్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి.  నిషేధాజ్ఞలు విధించి… ప్రజలను ఇళ్ల నుంచి రాకుండా ఆంక్షలు జారీచేస్తున్నాయి. అయినా, వైరస్ మరణాలు, బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. వైర‌స్‌కి సంబంధించి శాస్త్ర‌వేత్త‌ల తాజాగా అధ్య‌య‌నం భార‌త్‌కు వ‌ణుకు పుట్టిస్తోంది.

 

ఓ ప‌క్క దేశంలో కరోనా లక్షణాలు కనిపిస్తున్న అనుమానితులను పరీక్షించడానికే సరైన వనరులు, సదుపాయాలు లేక నానా ఇబ్బందులు పడుతుంటే, తాజాగా వెల్లడైన పరిశోధన ఒకటి మరింత కలవరపెడుతోంది. సైంటిస్టుల తాజా అధ్య‌య‌నం మేర‌కు .. ఇప్పటివరకూ కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ఆ లక్షణాలు ఉన్న వారి నుంచే వ్యాపిస్తోందని ప్రచారంలో ఉంది. కాని, చైనాలో జరిగిన కొన్ని పరిశోధనల్లో కఠోర వాస్తవం ఒకటి బయటపడింది. కరోనా లక్షణాలు అసలేం కనిపించని వారిలో కూడా అది విస్తరించి ఉందని, వారి నుంచి కూడా ఇతరులకు వేగంగా అంటుకుంటోందని వెల్లడైంది. కరోనా లేని వ్యక్తి నుంచి మరొక ఆరోగ్యవంతమైన వ్యక్తికి సోకిన రెండు మూడు రోజుల తర్వాత కాని కొన్ని వైరస్‌ లక్షణాలు బయటపడడం లేదు. ఈ వాస్తవాన్ని నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌ ఈ నెల 15వ తేదీ సంచికలో వెల్లడించింది.

 

చైనాలోని గాంగ్‌ఝౌ ఆస్పత్రిలో చేరిన కొందరు కరోనా బాధితులను పరీక్షించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్టు నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌ పేర్కొంది. ఇలా 44 శాతం మందిలో వైర‌స్ వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఇది సింగపూర్‌లో 48 శాతంగాను, చైనాలోని తియాంజిన్‌ ప్రావిన్స్‌లో 62 శాతంగాను ఉన్నట్టు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు, పరిశోధన జరిపిన వారిలో గాంగ్‌ఝౌ మెడికల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్త‌ల‌తో పాటు హాంకాంగ్‌ యూనివర్శిటీకి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంలోని సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫెక్షివస్‌ డిసీజ్‌ ఎపిడిమియోలజీ అండ్‌ కంట్రోల్ సైంటిస్టులు కూడా ఉన్నారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా సోకినట్టు భావిస్తున్న అనుమానితులను మాత్రమే పరీక్షిస్తున్నారు. వీరిలో ట్రావెల్‌ హిస్టరీని కనుగొనేందుకే ఇవి ఉపయోగపడుతున్నాయి.

అయితే, భారత మెడికల్‌ కౌన్సిల్‌ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ మధ్య జరిపిన ర్యాండమ్‌ పరీక్షల్లో 104 టెస్ట్‌లు పాజిటివ్‌గా తేలాయి. వీటిలో 40 కేసుల్లో ఎటువంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని తేలినా, వారికి ఎలా వ్యాప్తి చెందిందన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రస్తుత పరిశోధనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.