బ్రేకింగ్‌ న్యూస్.. హౌరాలో పోలీసులపైకి రాళ్లదాడి.. ఇద్దరికి గాయాలు

| Edited By: Pardhasaradhi Peri

Apr 28, 2020 | 9:01 PM

వెస్ట్ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయనడానికి మంగళవారం జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. వెస్ట్‌ బెంగాల్‌లోని హౌరా ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు స్థానికులు. టికియాపరా ప్రాంతంలో స్థానికులు గుమికూడి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. వారిని ఇండ్లకు వెళ్లాలంటూ ఆదేశించారు. దాదాపు 20మంది వరకు ర్యాపిడ్ యాక్షన్‌ ఫోర్స్‌కు సంబంధించిన పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కలిసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే వారు పోలీసులపై […]

బ్రేకింగ్‌ న్యూస్.. హౌరాలో పోలీసులపైకి రాళ్లదాడి.. ఇద్దరికి గాయాలు
Follow us on

వెస్ట్ బెంగాల్‌లో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నాయనడానికి మంగళవారం జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ వైపు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. వెస్ట్‌ బెంగాల్‌లోని హౌరా ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు స్థానికులు. టికియాపరా ప్రాంతంలో స్థానికులు గుమికూడి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. వారిని ఇండ్లకు వెళ్లాలంటూ ఆదేశించారు. దాదాపు 20మంది వరకు ర్యాపిడ్ యాక్షన్‌ ఫోర్స్‌కు సంబంధించిన పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కలిసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే వారు పోలీసులపై ఎదురు దాడికి దిగారు. ఏకంగా ఆర్‌ఏఎఫ్‌ పోలీసులపైకి భౌతిక దాడులకు దిగారు. అంతటితో ఆగకుండా రాళ్ల దాడికి దిగుతూ.. పోలీసులనే పరుగులు పెట్టించారు. పోలీసుల అక్కడి నుంచి వెళ్తుండగా వారు వచ్చిన వాహనాలపై కూడా దాడులకు దిగారు. అల్లరి మూకలు పెద్ద ఎత్తున రాళ్ల దాడులకు దిగుతుండటంతో.. పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

మరోవైపు హౌరా ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ.. మమతా సర్కార్‌ మాత్రం శాంతి భద్రతల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు గవర్నర్‌ కూడా ఇదే అంశాన్ని ట్విట్టర్‌ వేదికగా లేవనెత్తారు.