కరోనా వైరస్‌.. హాలీవుడ్ కండల వీరుడి ఉదారభావం.. హ్యాట్సాఫ్‌ టు రియల్ హీరో..!

| Edited By:

Apr 02, 2020 | 9:57 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను జయించేందుకు చాలా దేశాల దేశాధినేతలు నడుం బిగించారు. ఎలాగైనా ఈ మహమ్మారి ఆట కట్టేయాలని వారు భావిస్తున్నారు.

కరోనా వైరస్‌.. హాలీవుడ్ కండల వీరుడి ఉదారభావం.. హ్యాట్సాఫ్‌ టు రియల్ హీరో..!
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను జయించేందుకు చాలా దేశాల దేశాధినేతలు నడుం బిగించారు. ఎలాగైనా ఈ మహమ్మారి ఆట కట్టేయాలని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేస్తూ తాము రియల్ హీరోలమని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ తన ఉదారభావాన్ని చాటారు. అమెరికాలో కరోనాను పాలద్రోలే క్రమంలో మెడికల్ పరికరాల కోసం ఆయన 1.43మిలియన్‌ డాలర్లను విరాళంగా ఇచ్చారు. అంతేకాదు 50వేల మాస్కులను ఆయన డాక్టర్లకు ఉచితంగా ఇచ్చారు. వీటితో పాటు  కరోనాపై అందరిలో అవేర్‌నెస్ తీసుకొచ్చేందుకు గత కొన్ని రోజులుగా ఆయన వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని అయ్యో ఎంత కష్టం వచ్చింది అని ఆలోచించుకుంటూ నేను ఊరికే కూర్చోలేను. నా తరఫున అవ్వగలిగేంత సహాయం చేయాలనుకుంటా. హాస్పిటళ్లలో ఉన్న మన రియల్ హీరోలను కాపాడుకోవడానికి ఇది గొప్ప మార్గం. అందులో నేను భాగమైనందుకు సంతోషిస్తున్నా అని ఆర్నాల్డ్ తెలిపారు. కాగా గతంలోనూ ఈయన పలుమార్లు రియల్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే.

Read This Story Also: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’కు కాపీ మరక..!