హిమాచల్‌ ప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 5:18 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బుధవారం నాటికి దేశవ్యాప్తంగా లక్షన్నర మార్క్‌ను దాటాయి. ఇందులో నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మొన్నటి వరకు కేసుల సంఖ్య అత్యల్పంగా ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో.. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో బుధవారం నాటికి 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా, మంగళవారం నాడు మొత్తం 143 మందికి పరీక్షలు జరపగా.. అందులో 77 కరోనా […]

హిమాచల్‌ ప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బుధవారం నాటికి దేశవ్యాప్తంగా లక్షన్నర మార్క్‌ను దాటాయి. ఇందులో నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మొన్నటి వరకు కేసుల సంఖ్య అత్యల్పంగా ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో.. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో బుధవారం నాటికి 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కాగా, మంగళవారం నాడు మొత్తం 143 మందికి పరీక్షలు జరపగా.. అందులో 77 కరోనా నెగిటివ్‌ వచ్చిందని.. మిగతా 66 మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో హమీర్పూర్‌ జిల్లాలో అత్యధికంగా 78కేసులు నమోదవ్వగా.. ఆ తర్వాత కంగ్రా జిల్లాలో 62 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 175 యాక్టివ్ కేసులు ఉండగా.. 63 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాధికారులు తెలిపారు.