కారులో శానిటైజర్..బాంబ్‌ కంటే ప్రమాదం..తస్మాత్ జాగ్రత్త !

|

May 27, 2020 | 6:19 PM

కరోనా వైరస్ వ్యాప్తించకుండా ఉండేందుకు తరచూ శానిటైజర్లతో చేతులు కడుక్కొవాలన్న వైద్యుల సూచన మేరకు ఇప్పుడు అందరూ వాటిని వెంటపెట్టుకుని ఉంటున్నారు. అయితే, ఈ శానిటైజర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కారు ప్రయాణాల తర్వాత

కారులో శానిటైజర్..బాంబ్‌ కంటే ప్రమాదం..తస్మాత్ జాగ్రత్త !
Follow us on

కోవిడ్-19: కరోనా వైరస్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. చిన్నాపెద్ద తేడా లేదు. పల్లె పట్నం, అంతటా విస్తరిస్తూ వైరస్ ప్రతాపం చూపెడుతోంది. ‘కరోనా వైరస్’పేరు వింటేనే సామాన్య జనానికి ఒంటిలో నుంచి వణుకుపుడుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు, వైద్యులు చెప్పిన సూచనలు తూ.చ తప్పక పాటిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరూ మాస్క్ లు ధరించడం మొదలు పెట్టారు. ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం పాటిస్తున్నారు. అయితే వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రక్షణకు బదులు అవే కరోనా దారులుగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తించకుండా ఉండేందుకు తరచూ శానిటైజర్లతో చేతులు కడుక్కొవాలన్న వైద్యుల సూచన మేరకు ఇప్పుడు అందరూ వాటిని వెంటపెట్టుకుని ఉంటున్నారు. అయితే, ఈ శానిటైజర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కారు ప్రయాణాల తర్వాత వేడిగా ఉన్నప్పుడు వాటిలో శానిటైజర్లను ఉంచకూడదని అమెరికన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్‌లో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కనుక అది బయటికొచ్చి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. దీంతో కార్లు తగలబడతాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెరికాలో ఓ కారు శానిటైజర్ వల్ల కాలిపోవడంతో ఈ హెచ్చరిక జారీ చేశారు. అసలే వేసవి కాలంతో మండిపోతున్న ఎండలకు కార్లు మరింత వేడెక్కుతాయని, ఏమాత్రం పొరపాటు జరిగినా మంటలు చెలరేగే ప్రమాదం పొంచిఉందంటున్నారు. కారు ప్రయాణం చేసేటప్పుడు శానిటైజర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.