పతంజలికి కేంద్రం భారీ ఝలక్‌..

| Edited By:

Jun 23, 2020 | 7:46 PM

కరోనా మహమ్మారికి మెడిసిన్ కనుగొన్నామంటూ పతంజలి ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగా గురువు బాబా రాందేవ్...

పతంజలికి కేంద్రం భారీ ఝలక్‌..
Follow us on

కరోనా మహమ్మారికి మెడిసిన్ కనుగొన్నామంటూ పతంజలి ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగా గురువు బాబా రాందేవ్‌ చేతుల మీదుగా కోరోనిల్‌ పేరుతో కిట్‌ను ఆవిష్కరించారు. అయితే దీనికి సంబంధించిన వార్తలు అన్ని జాతీయ మీడియాల్లో కూడా రావడంతో దీనిపై కేంద్ర ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ స్పందించింది. కరోనాకు సంబంధించి పతంజలి చెప్తున్న దాని గురించి తమకు సమాచారం లేదని.. దానికి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ కానీ.. మెడిసిన్ శాస్త్రీయత గురించి కానీ.. ఇప్పుడే నిర్ధారించలేమని ఆయుష్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించినట్లు ఆయుష్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు.. తదుపరి ప్రకటన వరకు.. దీనికి సంబంధిచిన ప్రకటనలు కానీ.. పంపిణీ కానీ చేసేందుకు వీలులేదని ప్రకటించింది.

కాగా, యోగా గురువు రాందేవ్‌ బాబా కరోనా మహమ్మారిని తాము తయారు చేసిన మెడిసిన్ కోరోనిల్‌ నయం చేస్తుందని.. తాము 280 మంది కరోనా పేషేంట్స్‌ మీద ప్రయోగించినట్లు తెలిపారు. వారంతా 4-7 రోజుల్లో కోలుకున్నట్లు ప్రకటించారు.