గణేష్ ఉత్సవాలు జరుగుతాయి… భాగ్యనగర ఉత్సవ సమితి

|

Jul 02, 2020 | 6:25 PM

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ ప్రభావం పలు పండుగలపైనా కూడా పడింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు తగ్గిస్తారన్న ఊహగానాలు షికార్లు చేస్తున్నాయి. ఈ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు స్పందించారు. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం మాదిరిగినే ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. అయితే ఈ […]

గణేష్ ఉత్సవాలు జరుగుతాయి... భాగ్యనగర ఉత్సవ సమితి
Follow us on

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ ప్రభావం పలు పండుగలపైనా కూడా పడింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు తగ్గిస్తారన్న ఊహగానాలు షికార్లు చేస్తున్నాయి. ఈ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు స్పందించారు.

హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం మాదిరిగినే ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. అయితే ఈ నెల 31 తర్వాతే ఉత్సవాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొందరు రాజకీయ మైలేజీ కోసమే అలాంటి ప్రకటనలు చేస్తుంటారని అన్నారు. ముంబైలోపరిస్థితి వేరు మన హైదరాబాద్‌లో పరిస్థితి వేరని అన్నారు. ఇళ్లలో చేసే గణపతి పూజలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు. ఉత్సవాలు నిర్వహించేందుకు గణేష్ భక్తుల సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇక గణేష్ ఉత్సవాల కోసం పెట్టే ఖర్చును కరోనా నియంత్రణ కోసం డొనేట్ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.