భార్యకు పాజిటివ్‌గా తేలడంతో.. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో మాజీ సీఎం

| Edited By:

Aug 12, 2020 | 8:39 PM

ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ బుధవారం నాడు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. తన భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ..

భార్యకు పాజిటివ్‌గా తేలడంతో.. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో మాజీ సీఎం
Follow us on

ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ బుధవారం నాడు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. తన భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. తనతో పాటుగా.. కుటుంబ సభ్యులంతా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు ఆయన తన అధికారిక ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇటీవల కాలంలో.. తనను కలిసిన వారంతా కూడా.. హోం క్వారంటైన్‌లో ఉంటూ.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

నా భార్య వీణా సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ల సలహా మేరకు ఆమె ఆస్పత్రిలో చేరారు. నేను, నా ఇతర కుటుంబ సభ్యులంతా.. ఐసోలేషన్‌లో ఉంటూ.. కరోనా పరీక్షలు చేయించుకుంటాం. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారంతా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. అని ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే