కరోనా కోసం ఫేస్‌బుక్‌లో కొత్తగా రెండు ఎమోజీలు

| Edited By:

Apr 18, 2020 | 9:07 AM

కరోనా వైరస్ మహమ్మారిపై యూజర్లు తమ స్పందనను వ్యక్తం చేసేందుకు ఫేస్‌బుక్ తాజాగా రెండు ఎమోజీలను యాడ్ చేసింది. ఇప్పటివరకూ ఐదు రకాల ఫేస్‌బుక్ ఎమోజీలు ఉండగా..

కరోనా కోసం ఫేస్‌బుక్‌లో కొత్తగా రెండు ఎమోజీలు
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పూర్తిగా విస్తరించింది. దీని కట్టడికి వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో.. అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఇప్పటికే దీని ఎఫెక్ట్‌కి ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల 27 వేలకు పైగా కరోనా పాజిటివ్ సోకగా.. లక్షా 50 వేల మందికి పైగా మరణించారు. అయితే ఈ మహమ్మారిపై యూజర్లు తమ స్పందనను వ్యక్తం చేసేందుకు ఫేస్‌బుక్ తాజాగా రెండు ఎమోజీలను యాడ్ చేసింది. ఇప్పటివరకూ ఐదు రకాల ఫేస్‌బుక్ ఎమోజీలు ఉండగా.. మరో రెండు ఎమోజీలను జత చేసింది.

ఒకటి హృదయాన్ని ముఖానికి అడ్డుకున్నట్లుగా ఒక ఎమోజీ కాగా, మరొకటి హార్ట్ సింబల్‌ని కూడా జత చేసింది. కాగా ఫేస్‌బుక్‌తో పాటు మెసెంజర్‌లోనూ ఈ ఎమోజీలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఫేస్ బుక్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ అలెగ్జాండ్రు వొయికా తెలిపారు. కాగా ఈ ఎమోజీలు వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. అలాగే వీటిని ఎలా ఉపయోగించాలో తెలుపుతూ వీడియో కూడా ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Read More: యాంటీబాడీస్‌పై డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన.. ఆ ఆశలపై నీళ్లు..