ఫేస్‌మాస్క్‌ ధరించకుంటే రూ.10వేలు జరిమానా..!

| Edited By:

Jul 15, 2020 | 6:07 AM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోటికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడి కోసం పలు దేశాలు కఠిన..

ఫేస్‌మాస్క్‌ ధరించకుంటే రూ.10వేలు జరిమానా..!
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోటికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడి కోసం పలు దేశాలు కఠిన నిర్ణయాలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో యూకే కూడా పలు కఠిన నిబంధనలను తీసుకొస్తోంది. ఈ జూలై 24వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాలతో పాటు.. షాప్స్‌లో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఎవరైనా మాస్క్ ధరించకపోతే వారికి వంద పౌండ్ల పెనాల్టీని విధించనున్నట్లు యూకే సర్కార్ ప్రకటించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ.10 వేల రూపాయలు పెనాల్టీని విధించనున్నారు. ఇంగ్లాడ్‌ మొత్తం ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ప్రభుత్వం సోమవారం నాడే ప్రకటించింది. అయితే ఈ జరిమానా విధించే అధికారాన్ని పోలీసులకు అప్పచెప్పింది. కాగా, యూకేలో ఇప్పటి వరకు 2.91 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..
కరోన బారినపడి దాదాపు 45 వేల మందికి పైగా మరణించారు.