కరోనా కట్టడికి యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి..

| Edited By:

May 01, 2020 | 6:23 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ముప్పై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా..  తొమ్మిది వేల మంది వరకు కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. ప్రభుత్వాలు కఠిన చర్యలకు  ఉపక్రమిస్తోంది. అందులో తాజాగా ఉత్తర ప్రదేశ్ యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలను ఇంకా […]

కరోనా కట్టడికి యోగీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ముప్పై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా..  తొమ్మిది వేల మంది వరకు కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో.. ప్రభుత్వాలు కఠిన చర్యలకు  ఉపక్రమిస్తోంది. అందులో తాజాగా ఉత్తర ప్రదేశ్ యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలను ఇంకా కఠినంగా అమలు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా యూపీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించిన తర్వాత.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని బార్డర్లన్నింటిని మూసివేయడం ద్వారా.. కరోనా వైరస్ క్యారియర్ల ప్రవేశానికి చెక్ పెట్టవచ్చని యోగీ స్పష్టం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలోకి ఇతర మార్గాల ద్వారా వచ్చే ప్రాంతాలను కూడా గమనించాలని.. అన్ని మార్గాలను మూసేయాలని.. అత్యవసర పరిస్థితుల్లో లోనికి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే లోనికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు.