దేశ రాజధానిలో మరో 1,250 పాజిటివ్ కేసులు

| Edited By:

Aug 21, 2020 | 8:29 PM

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా..

దేశ రాజధానిలో మరో 1,250 పాజిటివ్ కేసులు
Follow us on

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,604కి చేరింది. వీటిలో ఢిల్లీ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 1,42,908 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 11,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, శుక్రవారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా 17 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 6,086 ఆర్టీపీసీఆర్‌ విధానంలో నిర్వహించగా.. 11,649 రాపిడ్ యాంటిజెన్‌ విధానంలో నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 13,92,928 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం