మహారాష్ట్రను వణికిస్తోన్న కరోనా మహమ్మారి..!

| Edited By:

Apr 01, 2020 | 10:40 PM

కరోనా మహమ్మారి దేశంలో చాప కింద నీరులా వ్యాపించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ వైరస్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 13కి చేరింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా 335 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఈ మహమ్మారిని అరికట్టేందుకే కేంద్రం ప్రభుత్వం […]

మహారాష్ట్రను వణికిస్తోన్న కరోనా మహమ్మారి..!
Follow us on

కరోనా మహమ్మారి దేశంలో చాప కింద నీరులా వ్యాపించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ వైరస్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 13కి చేరింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా 335 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

కాగా.. ఈ మహమ్మారిని అరికట్టేందుకే కేంద్రం ప్రభుత్వం 21 రోజులపాటు.. (ఏప్రిల్ 14 వరకు) లాక్‌డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ.. దీనిబారీన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం కలకలం రేపుతోంది.