ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటే ఇదే మరీ..

| Edited By:

Mar 31, 2020 | 3:02 PM

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే రోజు ఇంటిలో కాలక్షేపానికి టీవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రెగ్యూలర్ సీరియల్స్‌కు బదులుగా ఓల్ట్ సీరియల్స్ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు. అంతేకాదు.. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు రిక్వెస్ట్ కూడా పెట్టారట. దీంతో దూరదర్శన్‌లో ఒకప్పటి ప్రాయోజిత కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. తొలుత ఆధ్యాత్మికతతో […]

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటే ఇదే మరీ..
Follow us on

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెత అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే రోజు ఇంటిలో కాలక్షేపానికి టీవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో రెగ్యూలర్ సీరియల్స్‌కు బదులుగా ఓల్ట్ సీరియల్స్ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు. అంతేకాదు.. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు రిక్వెస్ట్ కూడా పెట్టారట. దీంతో దూరదర్శన్‌లో ఒకప్పటి ప్రాయోజిత కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. తొలుత ఆధ్యాత్మికతతో ప్రారంభం చేసి.. ఆ తర్వాత ఇప్పుడు ఎంటర్‌టైన్‌ మెంట్ సీరియల్స్‌ను ప్రసారం చేసేందుకు దూరదర్శన్ రెడీ అయ్యింది.

ఇప్పటికే రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను దూరదర్శన్‌, డీడీ భారతిలో ప్రసారం చేస్తోంది. ఇక తాజాగా.. శక్తిమాన్, చాణక్య సీరియల్స్‌ను కూడా ఏప్రిల్‌ తొలివారం నుంచి ప్రసారం చేయనున్నట్టు దూరదర్శన్‌ తెలిపింది. అంతేకాదు.. వీటితో పాటుగా శ్రీమాన్‌ శ్రీమతి, ఉపనిషద్‌ గంగా, కృష్ణ కాళి సీరియల్స్‌ కూడా ప్రసారం అవుతాయని సమాచార శాఖ పేర్కొంది.