వారం రోజుల్లో 70 లక్షల మంది తొలిడోసు.. తెలంగాణకు కోటిన్నర టీకాలు… ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం   

|

Dec 07, 2020 | 12:38 PM

రాష్ట్రంలో కొవిడ్ టీకా వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. ప్రజలకు అందించడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో

వారం రోజుల్లో 70 లక్షల మంది తొలిడోసు.. తెలంగాణకు కోటిన్నర టీకాలు... ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం   
Follow us on

రాష్ట్రంలో కొవిడ్ టీకా వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. ప్రజలకు అందించడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో దేశం వ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల నుంచి 75 లక్షల మందికి టీకా వేసే అవకాశాలున్నట్లు ప్రభుత్వం యోచిస్తోంది. నిర్దేశించిన వ్యక్తులకు 2 డోసుల చొప్పున 3-4 వారాల్లో ఇవ్వాలని.. దీనికి రాష్ట్రానికి సుమారు కోటిన్నర డోసులు రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ వినియోగానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంమీద 10వేల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో బృందంలో నర్సు.. ఏఎన్ఎం.. ఆశా కార్యకర్త ఉండనున్నారు. రోజుకు 100 మందికి ఈ బృందం టీకా ఇవ్వనుంది. ఒక్కరోజులో లక్ష మందికి.. వారంలో 70 లక్షల మందికి ఈ బృందాలు టీకాలు వేస్తాయి.

ఎవరెవరికి టీకాలు అందే అవకాశం..

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ఈ టీకా అందించడానికి కేంద్రం నిర్ణయించుకున్న కోటి మంది లక్ష్యం కాగా రాష్ట్రంలో ఈ కేటగిరికి వచ్చేవారు సుమారు 3 లక్షల మంది. ఇందులో 50 ఏళ్ళు పైబడిన 26 కోట్ల మందికి టీకా ఇచ్చే విభాగానికి సంబంధించి రాష్ట్రంలో 60 లక్షల నుంచి 65 లక్షల మంది ఉంటారని అంచనా. అయితే 50 ఏళ్ళలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారికి కోటి మందికి టీకా ఇచ్చే విభాగానికి సంబంధించి రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా ఉంటారని భావిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రవాణా ఉద్యోగులు, పాత్రికేయులు ఇతరులకు 2 కోట్ల మంది విభాగానికి  సంబంధించి రాష్ట్రంలో 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ఇంకా వేర్వేరు కేటగిరీలన్నింటిలోనూ పలు విభాగాల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో 50 ఏళ్ళు దాటిన వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు వంటివారు ఉన్నారు. వీరికి ఏదో ఒక కేటగిరి కిందే తీసుకోవడం ద్వారా మరింత ఎక్కువ మందికి వ్యాకిన్స్ ఇచ్చే అవకాశాలుంటాయని వైద్య శాఖ భావిస్తుంది.