కరోనా అప్‌డేట్స్‌: 61 లక్షలు దాటేసిన కేసులు.. జర్మనీకి దగ్గరగా భారత్..!

| Edited By:

May 31, 2020 | 11:15 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. చాలా దేశాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజా వివరాల ప్రకారం

కరోనా అప్‌డేట్స్‌: 61 లక్షలు దాటేసిన కేసులు.. జర్మనీకి దగ్గరగా భారత్..!
Follow us on

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. చాలా దేశాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజా వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 61లక్షలు దాటేసింది. 61,60,299 కరోనా కేసులు నమోదు కాగా.. 27,38,286మంది కోలుకున్నారు. 3,71,006 మంది ఈ వ్యాధితో మృత్యువాతపడ్డారు. అమెరికాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య 18,16,820కు చేరింది. 1,05,557మంది మరణించగా.. 535,238 మంది కోలుకున్నారు.

అమెరికా తరువాత బ్రెజిల్‌(5,01,492), రష్యా(3,96,575), స్పెయిన్(2,86,308), యునైటెడ్ కింగ్‌డమ్‌(2,72,826), ఇటలీ(2,32,664), ఫ్రాన్స్(1,88,625), జర్మనీ(1,83,294), ఇండియా(1,82,459), టర్కీ(1,63,103) దేశాలు టాప్ 10లో ఉన్నాయి. వైరస్‌ పుట్టిన చైనాలో తాజాగా 2 కొత్త కేసులు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌ దేశం కరోనాను దాదాపుగా జయించింది. గత వారం రోజులుగా అక్కడ ఒక్క కొత్త కేసు కూడా నమోదు అవ్వకపోగా.. ఒకే ఒక్క యాక్టివ్ కేసు ఆ దేశంలో ఉంది. అలాగే చైనా పక్కనే ఉన్న తైవాన్‌లో మొన్నటివరకు పూర్తిగా తగ్గిన కరోనా.. మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోంది. గడిచిన ఎనిమిది రోజుల్లో ఆ దేశంలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే భారత్‌లో కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. జర్మనీని బీట్ చేసేందుకు దగ్గర్లో ఉంది. ఇదే జరిగితే ప్రపంచ కరోనా లిస్ట్‌లో భారత్ స్థానం 8కి ఎగబాగుతుంది.

Read This Story Also: మద్యం షాపుల్లో సూపర్‌వైజర్లుగా కండక్టర్లు.. ఆలోచనలో అధికారులు..!