తెలుగు రాష్ట్రాల్లో సాఫీగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. తెలంగాణలో 13,666 మందికి.. ఏపీలో 14,606 మందికి టీకాలు

| Edited By: Narender Vaitla

Jan 19, 2021 | 6:19 AM

మూడో రోజు రాష్ట్రంలో 14,606 మందికి కరోనా వ్యాక్సిన్‌ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడో రోజు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో..

తెలుగు రాష్ట్రాల్లో సాఫీగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ.. తెలంగాణలో 13,666 మందికి.. ఏపీలో 14,606 మందికి టీకాలు
Follow us on

Covid 19 Vaccination : తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాఫీగా సాగుతోంది. జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు, పీహెచ్​సీల్లో వాక్సినేషన్​ను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. సోమవారం తెలంగాణలో 335 కేంద్రాల్లో కరోనా టీకా వేశారు. ఈరోజు 13,666 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్నవారిలో 15 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మంగళవారం నుంచి ప్రతి కేంద్రంలో రోజుకి 100 మందికి వాక్సిన్​ ఇవ్వనున్నారు.

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా కొనసాగనున్న వ్యాక్సిన్‌ ప్రక్రియంగా సాగింది. ఇందులో భాగంగా ముందుగా వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా​ను అందించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఎటువంటి సమస్యలూ.. తలెత్తలేదని అధికారులు వెల్లడించారు.

మూడో రోజు రాష్ట్రంలో 14,606 మందికి కరోనా వ్యాక్సిన్‌ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడో రోజు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,847 మందికి టీకాలు‌ వేశారు. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 459 మందికి వ్యాక్సిన్‌ చేశారు. 3.87 లక్షల మందికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు పేర్కొన్నారు.