Covid 19: కరోనా బాధితులకు అక్కడి డాక్టర్ల స్పెషల్ ట్రీట్‌మెంట్.. వీడియో చూడాల్సిందే..!

| Edited By:

Mar 06, 2020 | 12:59 PM

కరోనా భయం రోజురోజుకు ఎక్కువవుతోంది. దాదాపుగా లక్ష మంది బాధితులు ఈ మహమ్మారితో ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. వీరిలో కొంతమంది కోలుకునే సూచనలు ఉన్నాయి.

Covid 19: కరోనా బాధితులకు అక్కడి డాక్టర్ల స్పెషల్ ట్రీట్‌మెంట్.. వీడియో చూడాల్సిందే..!
Follow us on

కరోనా భయం రోజురోజుకు ఎక్కువవుతోంది. దాదాపుగా లక్ష మంది బాధితులు ఈ మహమ్మారితో ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. వీరిలో కొంతమంది కోలుకునే సూచనలు ఉన్నాయి. అయితే బాధితులు కోలుకోవడంతో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు డాక్టర్లు. ఎంతో జాగ్రత్తల మధ్య కరోనా బాధితులకు చికిత్సను అందిస్తూ తాము దేవుడితో సమానమని అందరికీ గుర్తుచేస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా వారిలో డాక్టర్లు ధైర్యాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌లో వైద్యులు కరోనా బాధితుల కోసం స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. కేవలం మెడిసిన్ మాత్రమే ఇవ్వకుండా మానసికంగా కరోనా బాధితులు ధృడంగా ఉండేందుకు అక్కడి వైద్యులు డాన్సులు వేస్తున్నారు. దానికి సంబంధించిన ఓ వీడియోను స్థానిక జర్నలిస్ట్ నెగర్ మోర్తజవి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘‘వనరులు, పరికరాలు కొరతగా ఉన్నప్పటికీ.. ఇరాన్‌లోని డాక్టర్లు, నర్సులు కరోనాతో యుద్ధం చేస్తున్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ మహమ్మారితో పోరాటం చేస్తున్నారు’’ అని ఆ వీడియోకు ఆమె కామెంట్ పెట్టారు. ఇక ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అందరూ వావ్.. సూపర్.. నిజంగా మీరు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా చైనా తరువాత కరోనా బాధితుల సంఖ్య ఇరాన్‌లో పెరుగుతోన్న విషయం తెలిసిందే.