హైదరాబాద్‌లో 15 హాట్‌స్పాట్స్‌.. అష్టదిగ్బంధంలో కంటైన్‌మెంట్ జోన్లు..

|

Apr 11, 2020 | 1:55 PM

Coronavirus Outbreak: హైదరాబాద్‌లో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ సర్కార్ సమర్ధవంతంగా చర్యలు చేపడుతోంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రాజధానిలో 15 హాట్‌స్పాట్స్‌లను గుర్తించారు. మరోవైపు కంటైన్‌మెంట్ జోన్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ జోన్లలను అష్టదిగ్బంధం చేశామన్నారు. ప్రభుత్వం తరుపు నుంచే ఇంటింటికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బయటికి వస్తే మాత్రం కఠిన శిక్షలు తప్పవని […]

హైదరాబాద్‌లో 15 హాట్‌స్పాట్స్‌.. అష్టదిగ్బంధంలో కంటైన్‌మెంట్ జోన్లు..
Follow us on

Coronavirus Outbreak: హైదరాబాద్‌లో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ సర్కార్ సమర్ధవంతంగా చర్యలు చేపడుతోంది. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రాజధానిలో 15 హాట్‌స్పాట్స్‌లను గుర్తించారు. మరోవైపు కంటైన్‌మెంట్ జోన్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ జోన్లలను అష్టదిగ్బంధం చేశామన్నారు. ప్రభుత్వం తరుపు నుంచే ఇంటింటికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బయటికి వస్తే మాత్రం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కాగా, రాంగోపాల్ పేట్, షేక్ పేట్, రెడ్ హిల్స్, మలక్ పేట్ నుంచి సంతోష్ నగర్ వరకు, చాంద్రాయణగుట్ట, ఆల్వాల్, మూసాపేట్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నుంచి గాజుల రామారం వరకు, మయూరి నగర్, యూసఫ్ గూడా, చందా నగర్ ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా అధికారులు గుర్తించారు.

ఇది చదవండి: దీనస్థితిలో పాకిస్తాన్.. వెంటిలేటర్లు అందించాలంటూ భారత్‌ను సాయం కోరుతున్న అక్తర్..