లాక్‌డౌన్‌ వేళ.. రైల్వే స్టేషన్‌ సమీపంలో వేల సంఖ్యలో జనం.. రీజన్ తెలిస్తే షాక్..

| Edited By: Pardhasaradhi Peri

Apr 14, 2020 | 7:18 PM

లాక్‌డౌన్‌ వేళ దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయంటూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో పుకార్లు వచ్చాయి. దీంతో వేల సంఖ్యలో ప్రజలు బాంద్రా రైల్వే స్టేషన్‌ వద్ద గుమికూడారు. తమ స్వస్థలాలకు వెళ్తామంటూ.. దాదాపు 1500 మంది రోడ్లపైకి వచ్చి గుమికూడారు. అంతటితో ఆగకుండా.. ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ పోలీసులు పలుమార్లు విన్నవించుకున్నారు. అయితే ఎంతటికీ వినకుండా ఆందోళన చేస్తుండటంతో.. పోలీసులు లాఠీలకు […]

లాక్‌డౌన్‌ వేళ.. రైల్వే స్టేషన్‌ సమీపంలో వేల సంఖ్యలో జనం.. రీజన్ తెలిస్తే షాక్..
Follow us on

లాక్‌డౌన్‌ వేళ దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయంటూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో పుకార్లు వచ్చాయి. దీంతో వేల సంఖ్యలో ప్రజలు బాంద్రా రైల్వే స్టేషన్‌ వద్ద గుమికూడారు. తమ స్వస్థలాలకు వెళ్తామంటూ.. దాదాపు 1500 మంది రోడ్లపైకి వచ్చి గుమికూడారు. అంతటితో ఆగకుండా.. ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ పోలీసులు పలుమార్లు విన్నవించుకున్నారు.

అయితే ఎంతటికీ వినకుండా ఆందోళన చేస్తుండటంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారుల్ని అక్కడి నుంచి తరిమేశారు. ఇదిలా ఉంటే.. రేషన కూడా పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు రావడంతో పలువురు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముంబైలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రధాని మోదీ కూడా.. మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే.