డ్రోన్‌తో పాన్ మసాలా హోం డెలివరీ.. వీడియో వైరల్..

|

Apr 13, 2020 | 4:07 PM

Coronavirus Lockdown: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహాయించి.. మిగిలినవన్నీ బంద్ అయ్యాయి. కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలను కోరుతున్నారు. అంతేకాక సామాజిక దూరాన్ని పాటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ అలవాట్లను వదులుకోలేని కారణంతో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ యదేచ్చగా బయట తిరుగుతున్నారు. మద్యానికి బానిస అయినవారు.. మందు కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరైతే […]

డ్రోన్‌తో పాన్ మసాలా హోం డెలివరీ.. వీడియో వైరల్..
Follow us on

Coronavirus Lockdown: కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహాయించి.. మిగిలినవన్నీ బంద్ అయ్యాయి. కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలను కోరుతున్నారు. అంతేకాక సామాజిక దూరాన్ని పాటించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ అలవాట్లను వదులుకోలేని కారణంతో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ యదేచ్చగా బయట తిరుగుతున్నారు.

మద్యానికి బానిస అయినవారు.. మందు కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరైతే చుక్క దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక ఇలాగే పాన్ మసాలాను ఏకంగా డ్రోన్ సాయంతో హోం డెలివరీ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని మోర్చిలో పాన్ మాసాలను ఇళ్లకు డెలివరీ చేయడానికి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. అక్కడి ప్రజలు తమ కోరికల నుంచి బయటపడలేక ఇలా డ్రోన్ సాయంతో తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయింది. ఇక అది చూసి పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల ఇళ్ల వద్దకే పాన్ మసాలాను సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదవండి: లాక్‌డౌన్‌ బేఖాతర్ చేస్తే.. ఈ శిక్షలు తప్పవు.. కేంద్రం అల్టిమేటం..