క్వారంటైన్‌ నుంచి జంప్‌.. ఎందుకు వెళ్లాడు..? ఎక్కడ దొరికాడో తెలుసా..!

కరోనా వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిని కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదు.

క్వారంటైన్‌ నుంచి జంప్‌.. ఎందుకు వెళ్లాడు..? ఎక్కడ దొరికాడో తెలుసా..!

Updated on: Mar 27, 2020 | 7:18 PM

కరోనా వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిని కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదు. చదువుకున్న వారు సైతం క్వారంటైన్‌కు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. మరికొందరు క్వారంటైన్ కేంద్రాల నుంచి పారిపోతున్నారు. అలాంటి ఘటన తాజాగా తమిళనాడులో జరిగింది. అయితే క్వారంటైన్‌ నుంచి అతడు ఎందుకు తప్పించుకున్నాడో తెలుసా..! తన ప్రియురాలి కోసం. నిజంగా మీరు చదివేది నిజమే.

తమిళనాడులో మదురైకి చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయి నుంచి భారత్‌కు వచ్చాడు. కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో అతడిని క్వారంటైన్‌కు తరలించారు. అయితే తన ప్రియురాలని కలవాలనుకున్న అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అతడి కోసం ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అతడి ప్రియురాలి ఇంట్లో గుర్తించారు. క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే అతడు చేసిన నిర్వాకంతో ఆ వ్యక్తి ప్రియురాలిని సైతం క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది.

Read This Story Also:  కరోనాపై యుద్ధంః అన్నయ్యకు ప్రత్యేక కృతఙ్ఞతలు.. వారిపై పవన్ ప్రశంసలు..!

Loading...
Unable to load recommendations.
Follow Us