కరోనా వైరస్ మనిషి సృష్టి కాదు.. ఇదిగో ప్రూఫ్..

|

May 22, 2020 | 9:44 PM

కరోనా వైరస్‌ను మనిషి ల్యాబ్‌లో సృస్టించాడా.? లేదా మాములు వైరస్ లానే రూపాంతరం చెందినదా..? ప్రస్తుతం యావత్ ప్రపంచానికి ఇవి అంతుచిక్కని ప్రశ్నలు. తాజాగా కరోనా పుట్టుక, వ్యాక్సిన్‌పై జరిగిన చర్చలో అమెరికాకు చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటేష్ పలు కీలక విషయాలను వెల్లడించారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌ వేదికలో పాల్గొన్న ఆయన కరోనా వైరస్ మనిషి సృష్టించింది కాదని స్పష్టం చేశారు. ఇది మనిషి సృష్టి కాదని చెప్పడానికి వీలుగా ఈ […]

కరోనా వైరస్ మనిషి సృష్టి కాదు.. ఇదిగో ప్రూఫ్..
Follow us on

కరోనా వైరస్‌ను మనిషి ల్యాబ్‌లో సృస్టించాడా.? లేదా మాములు వైరస్ లానే రూపాంతరం చెందినదా..? ప్రస్తుతం యావత్ ప్రపంచానికి ఇవి అంతుచిక్కని ప్రశ్నలు. తాజాగా కరోనా పుట్టుక, వ్యాక్సిన్‌పై జరిగిన చర్చలో అమెరికాకు చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వెంకటేష్ పలు కీలక విషయాలను వెల్లడించారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌ వేదికలో పాల్గొన్న ఆయన కరోనా వైరస్ మనిషి సృష్టించింది కాదని స్పష్టం చేశారు. ఇది మనిషి సృష్టి కాదని చెప్పడానికి వీలుగా ఈ విధంగా ఆయన మాటల్లో వివరించారు.

Cell.Com అనే జన్యుశాస్త్రం గురించి కథనాలను ప్రచురించే ఓ వెబ్‌సైట్‌.. కరోనాపై అధ్యయనం చేసి అది ఒక Zoonotic(జంతువుల నుంచి సంక్రమించే) వైరస్ అని తెలుపుతూ ఒక కథనం ప్రచురించింది. దాన్ని బేస్ చేసుకుని డాక్టర్ వెంకటేష్ వివరిస్తూ గబ్బిలాలు, పెంగోలిన్స్, హ్యూమన్స్‌లో ఉన్న యంటీ బాడిస్‌తో కరోనా వైరస్ జన్యువులను పోల్చి.. అవి ఎలా రియాక్ట్ అవుతాయన్న దానిపై స్టడీ చేశారని తెలిపారు. ఇక ఆ అధ్యయనంలో ముఖ్యంగా 5 అమైనో యాసిడ్లు కరోనా వైరస్ జన్యువుతో రియాక్ట్ అవుతాయని స్పష్టం చేశారు. ఈ ఐదు అమైనో యాసిడ్స్ గబ్బిలాలు, పెంగోలిన్స్, మనుషుల్లో కామన్ గా ఉంటాయని.. అవి గబ్బిలాల నుంచి పెంగోలిన్స్‌కు.. అలాగే పెంగోలిన్స్ నుంచి మనుషులకు సంక్రమించి ఉంటాయని.. లేదా గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించి ఉండవచ్చునని వివరించారు.

కాగా, కరోనా వైరస్ Coronaviridae ఫ్యామిలీకి చెందింది. ఇది ఒక Zoonotic వైరస్. ఇదే ఫ్యామిలీకి చెందిన మిగిలిన వైరస్‌లైన SARS, MERSలు గతంలోనే మానవులకు వ్యాప్తి చెందినవే. కరోనా వైరస్ జన్యువు RNAను కలిగి ఉంటుంది. ఇది మనుషుల్లో జలుబు, శ్వాశకోస సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. ఇదే జాతికి చెందిన SARS, MERSతో పోలిస్తే దీని తీవ్రత తక్కువ. SARS(15%) మరణాల రేటుతో పోలిస్తే కరోనా మరణాలు( ≤3%) తక్కువ అని కథనం పేర్కొంది. కరోనా మహమ్మారి సంక్రమణ కూడా 2.5 నుంచి 3 వరకు ఉంటుందని ఆ ఆర్టికల్‌ తెలిపింది.

పూర్తి వివరాలకు ఈ లింక్ చూడండి..