కరోనా పరీక్షా సెంటర్ల సంఖ్య పెంపు.. ప్రైవేట్ కంపెనీలకు అనుమతి

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2020 | 10:15 AM

రోజు రోజుకు తన వ్యాప్తిని పెంచుకుంటూ పోతోన్న కరోనా ఆట ఎలాగైనా కట్టేయాలని అన్ని దేశాలు నడుం బిగించాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాల పరిశోధకులు కరోనాను ఎదుర్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనా పరీక్షా సెంటర్ల సంఖ్య పెంపు.. ప్రైవేట్ కంపెనీలకు అనుమతి
Follow us on

రోజు రోజుకు తన వ్యాప్తిని పెంచుకుంటూ పోతోన్న కరోనా ఆట ఎలాగైనా కట్టేయాలని అన్ని దేశాలు నడుం బిగించాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాల పరిశోధకులు కరోనాను ఎదుర్కునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా పరీక్ష నిర్వహణకు తాజాగా 18 ప్రైవేట్ కంపెనీలకు అనుమతిని ఇచ్చింది డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా. ఇందులో దేశ, అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కరోనాపై పరీక్షలు నిర్వహించనున్నాయి. అందులో కాడిలా హెల్త్‌ కేర్ లిమిటెడ్, జైదుస్‌ హెల్త్‌ కేర్ లిమిటెడ్, మెడ్‌సోర్స్‌ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, కోసార డయోగ్నోస్టిక్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, రోచి డయోగ్నోస్టిక్స్‌, బయోమెరియక్స్‌ వంటి కంపెనీలు ఉన్నట్లు సమాచారం.

దీని గురించి ఓ సంబంధిత అధికారి మాట్లాడుతూ.. మమ్మల్ని చాలా కంపెనీలు సంప్రదించాయి. కానీ అందులో కొన్ని మాత్రమే పరిమితులను నెరవేర్చగలవు. ఇప్పుడు మేము ఇచ్చినది టెస్ట్ లైసెన్స్ మాత్రమే.. దానిపై మేము ముందు అధ్యయనం చేస్తాం. ఆ తరువాత లేబరేటరీ టెక్నీషియన్లను వారికి అందిస్తాం అని అన్నారు. కాగా ప్రస్తుతం దేశంలో 75 ప్రభుత్వ ప్రయోగశాలలు మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 250 దాటగా.. నలుగురు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా..!