ర్యాపిడ్ కిట్లతో కరోనా పరీక్ష చేయించుకున్న సీఎం జగన్..!

| Edited By:

Apr 17, 2020 | 7:22 PM

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇవాళ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే.

ర్యాపిడ్ కిట్లతో కరోనా పరీక్ష చేయించుకున్న సీఎం జగన్..!
Follow us on

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఇవాళ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కిట్లను ఉపయోగించి వైద్య సిబ్బంది జగన్‌కు కరోనా పరీక్ష చేశారు. ఫలితాల్లో ఆయనకు నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఫలితాలను తెలుసుకోవచ్చు. ర్యాపిడ్‌ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్‌ ఉంటాయి. కేవలం బ్లడ్‌ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేసి.. ఆ తరువాత కంట్రోల్‌ సొల్యూషన్‌ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలోనే శరీరంలో వైరస్‌ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్‌ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. ఐసీఎంఆర్‌ కూడా ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది. ఈ టెస్టు కిట్లను సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా ఏపీకి తీసుకొచ్చారు. 4 నుంచి 5 రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ ర్యాపిడ్ టెస్టు కిట్లను పంపిణీ చేయనున్నారు.

Read This Story Also: ‘గచ్చిబౌలి క్వారంటైన్‌ సెంటర్‌’కు ఆ ప్రముఖ సంస్థ భారీ సాయం..!