అక్కడ విచిత్రం.. ఇళ్లకు బయటనుంచి తాళాలు వేస్తున్నారు

| Edited By:

Apr 27, 2020 | 3:19 PM

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలోని కొన్ని ఇళ్లకు తాళాలు వేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండేందుకు బయట నుంచి తాళాలు వేస్తున్నారు. చైనా ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి చెందకుండా..

అక్కడ విచిత్రం.. ఇళ్లకు బయటనుంచి తాళాలు వేస్తున్నారు
Follow us on

జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలోని కొన్ని ఇళ్లకు తాళాలు వేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండేందుకు బయట నుంచి తాళాలు వేస్తున్నారు. చైనా ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి చెందకుండా వూహాన్‌లో ఇంటింటికి తాళాలు వేసింది. ఇప్పుడు అదే పద్ధతిని గద్వాల్‌లోనూ అమలు చేస్తున్నారు. వైరస్‌ కట్టడి చేయడానికి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా ఇంటింటికి తాళాలు వేసే పనిలో పడ్డారు అధికారులు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ఇళ్లకు తాళాలు వేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేశారు. ఫోన్‌ నంబర్లు సేకరించి వారికి కావలసిన నిత్యావసరవస్తువులను ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి చేరవేస్తున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 1001కి చేరుకున్నాయి. ఇప్పటివరకూ 25 మంది మృతి చెందారు. అలాగే 316 మంది డిశ్చార్జి కాగా.. 660 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే గద్వాల్లో 45 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా గద్వాల జిల్లా 5వ స్థానంలో ఉంది.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది