డబ్ల్యుహెచ్ఓకు బిల్ గేట్స్ భారీ విరాళం

|

Apr 16, 2020 | 2:27 PM

తాజాగా మైక్రోసాఫ్ట్ స‌హా వ్య‌వ‌స్థ‌ప‌కుడు బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ (డ‌బ్ల్యూ హెచ్‌వో)కు భారీ విరాళం అందజేశారు...

డబ్ల్యుహెచ్ఓకు బిల్ గేట్స్ భారీ విరాళం
Follow us on
ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా దెబ్బ‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం అయిపోతోంది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఉపాధిలేక‌, ఉన్న నిధులు క‌రిగిపోయి దేశాలు దిక్కుతోచ‌ని స్థితిలోకి జారుకుంటున్నాయి. ఈ త‌రుణంలో ఎంతోమంది సంప‌న్నులు ఆయా ప్ర‌భుత్వాల‌కు అండ‌గా నిలుస్తున్నాయి. సీఎం, పీఎం స‌హాయ‌క నిధికి భారీ విరాళాలు అంద‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా మైక్రోసాఫ్ట్ స‌హా వ్య‌వ‌స్థ‌ప‌కుడు బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ (డ‌బ్ల్యూ హెచ్‌వో)కు  భారీ విరాళం అందజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున 150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. తాజా విరాళంతో  గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కరోనా మహమ్మారి మానవ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన ప్రస్తుత తరుణంలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ సేవలు  మరింత అవసరమని బిల్ గేట్స్ సూచించారు.