వన్యప్రాణులకు వచ్చిన స్వతంత్రం

|

Apr 27, 2020 | 2:49 PM

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వాహనాల రాకపోకలు లేవు. రైళ్లు, విమానాలు ఆగిపోయాయి. రావాణా స్తంభించిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వాయు కాలుష్యం బాగా తగ్గిపోయింది. నదులు, చెరువులు మళ్లీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా జనం ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులకు స్వేచ్ఛ వచ్చేసింది. ఏకంగా నగరాల్లోకి వచ్చేస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే బ్రిటన్ లోని వైల్స్ రోడ్ల మీద జనం లేరు.. కానీ మేకలు మాత్రం బలాదూర్ గా […]

వన్యప్రాణులకు వచ్చిన స్వతంత్రం
Follow us on
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వాహనాల రాకపోకలు లేవు. రైళ్లు, విమానాలు ఆగిపోయాయి. రావాణా స్తంభించిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫలితంగా వాయు కాలుష్యం బాగా తగ్గిపోయింది. నదులు, చెరువులు మళ్లీ పరిశుభ్రంగా మారుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా జనం ఇళ్లకే పరిమితం కావడంతో అడవి జంతువులకు స్వేచ్ఛ వచ్చేసింది. ఏకంగా నగరాల్లోకి వచ్చేస్తున్నాయి.
నిత్యం రద్దీగా ఉండే బ్రిటన్ లోని వైల్స్ రోడ్ల మీద జనం లేరు.. కానీ మేకలు మాత్రం బలాదూర్ గా తిరుగుతున్నాయి..చిలీలోని రాజధాని శాంటియాగో వీధుల్లో ఒక అడవి ప్యూమా తిరుగాడుతోంది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ వంతెన దగ్గర ఓ నక్క ఎవరి కోసమో వేచి చూస్తోంది. సముద్ర తీరంలో జనం రద్దీ లేకపోవడంతో తాబేళ్లన్నీ గుంపులు గుంపుగా వచ్చి గుడ్డు పెడుతున్నాయి. ఈ వింతలన్నీ మనకు కనిపించడానికి కారణం ప్రపంచాన్ని వణికిస్తున్ర కరోనా వైరస్. అన్ని దేశాల్లోనూ లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అడవు వన్య ప్రాణలు వ‌చ్చి దర్జాగా నగర వీధుల్లో తిరుగాడుతున్నాయి.
వాషింగ్ టన్ అయినా.. రోమ్ అయినా.. బీజింగ్ అయినా.. ఢిల్లీ అయినా.. ప్రపంచ వ్యాప్తంగా రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.. ట్రాఫిక్ ఆక్షలు కూడా లేవు.. దీంతో  కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. భూగోళంపై పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తలు తగ్గిపోయాయి స్వచ్చమైన వాయులు వీస్తున్నాయి..మనం ఎన్నడూ చూడని అరుదైన దృశ్యాలు ఇవి.. భవిష్యత్తులో చూస్తామో లేదో.. అభివృద్ది పేరిట మనిషి ప్రకృతిని నాషనం చేస్తున్నాడు. ఇప్పడు మనిషి ఇంటిలో బంధీ కావడంతో ప్రకృతికి స్వేచ్ఛ వచ్చింది. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం మానవాళిని భయపడుతోంది. ఇళ్లలోనే బంధీలుగా మార్చిది.. కానీ ప్రకృతికి మాత్రం ఎంతో మేలు చేస్తోంది..