గీత‌కార్మికుల‌కు గుడ్‌న్యూస్‌…ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

|

Apr 30, 2020 | 3:07 PM

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏపీలో వేలాది సంఖ్య‌లో క‌ల్లుగీత కార్మికులు ఉపాధికి దూర‌మైన త‌రుణంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

గీత‌కార్మికుల‌కు గుడ్‌న్యూస్‌...ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
Follow us on

లాక్‌డౌన్‌కు వ‌రుస‌గా మిన‌హాయింపులు ఇస్తున్న ఏపీ ప్ర‌భుత్వం తాజాగా లాక్‌డౌన్ నుంచి క‌ల్లుగీత‌కు మిన‌హాయింపునిచ్చింది. లాక్‌డౌన్ నుంచి గీత‌కార్మికుల‌కు స‌డ‌లింపునిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. భౌతిక దూరం పాటిస్తూ  క‌ల్లుగీత వృత్తిని కొన‌సాగించ‌డంపై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌తో ఏపీలో వేలాది సంఖ్య‌లో క‌ల్లుగీత కార్మికులు ఉపాధికి దూర‌మైన త‌రుణంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యం వారికి  నిజంగా శుభ‌వార్త అని చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్‌ సడలింపునకు సంబంధించి ప్రభుత్వంఅదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన సూచనల మేరకు బుధవారం ఈ కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ క్రింది వాటికి మినహాయింపునిచ్చారు. మే 3తో లాక్‌ డౌన్‌ పూర్తికానున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

–  వ్యవసాయ రంగం, ఉద్యానవన పనులకు మినహాయింపు.- ఆర్థిక రంగానికి పూర్తిగా మినహాయింపు.- ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ఏర్పాటు.

– ప్లాంటేషన్‌ పనులు, కోత, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌కు అనుమతి.

– కావల్సిన అనుమతులతో ఈకామర్స్‌ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమ‌తి

– వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి స్వంత ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకునేందుకు అనుమతి.

– బుక్‌ షాపులు, ఎలక్ట్రిక్‌ ఫ్యాన్లు వంటి షాపులకు మినహాయింపు.

– మాల్స్‌ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ల కాంప్లెక్స్‌లకు అనుమతి.

– గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతోపాటు పవర్‌ లైన్స్‌, టెలీకాం కేబుల్స్‌ పనులకు అనుమతి.

– కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మినహాయింపు.