హ‌మ్మ‌య్య‌..ఏపీకి ఊర‌ట‌: 9 మందికి క‌రోనా నెగేటివ్‌..డిశ్చార్జి

|

Apr 09, 2020 | 6:48 AM

రోజుకు ప‌దుల సంఖ్య‌లో వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల్ని ఎటాక్ చేస్తున్న త‌రుణంలో ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ ఊర‌ట‌నిచ్చే వార్త‌నందించింది. క‌రోనా బారినప‌డ్డ వారిలో 9 మంది బాధితులు పూర్తి కోలుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. వారిని డిశార్చి చేసిన‌ట్లు..

హ‌మ్మ‌య్య‌..ఏపీకి ఊర‌ట‌: 9 మందికి క‌రోనా నెగేటివ్‌..డిశ్చార్జి
Follow us on
ఏపీని క‌రోనా వైర‌స్ హ‌డ‌లెత్తిస్తోంది. గ‌త వారం ప‌ది రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ తీవ్రరూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. రోజుకు ప‌దుల సంఖ్య‌లో వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల్ని ఎటాక్ చేస్తున్న త‌రుణంలో ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ ఊర‌ట‌నిచ్చే వార్త‌నందించింది. క‌రోనా బారినప‌డ్డ వారిలో 9 మంది బాధితులు పూర్తి కోలుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. వారిని డిశార్చి చేసిన‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించారు.
బుధవారం మధ్యాహ్నం వరకు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య ఆరుగా ఉంది.
నిన్న ఒక్క రోజే విశాఖపట్నంలో ముగ్గురిని డిశ్చార్జి చేశారు. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జి అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. కరోనాతో బాధపడుతున్న మొత్తం 9 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా, వారిని డిశ్చార్జి చేశారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో బుధవారం రాత్రికి 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో బుధవారం ఒక్కరోజే 34 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 49 కేసులు, నెల్లూరులో 48 కేసుల చొప్పున నమోదయ్యాయి.