ఏపీలో అందుబాటులోకి కోవిడ్-19 ఫార్మసీ యాప్

|

Apr 26, 2020 | 4:09 PM

కోవిడ్–19 వైరస్ వ్యాధి కట్టడికి ఫార్మసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని మెడిలక్ షాపుల యజమానులకు ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా క‌ర‌ళా నృత్యం చేస్తోంది. రోజురోజు విస్త‌రిస్తూ ప్ర‌తాపం చూపుతున్న వైర‌స్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ మేర‌కు మ‌రో వ్యూహాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ […]

ఏపీలో అందుబాటులోకి కోవిడ్-19 ఫార్మసీ యాప్
Follow us on
కోవిడ్–19 వైరస్ వ్యాధి కట్టడికి ఫార్మసీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని మెడిలక్ షాపుల యజమానులకు ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని పేర్కొంది.
రాష్ట్రంలో కరోనా క‌ర‌ళా నృత్యం చేస్తోంది. రోజురోజు విస్త‌రిస్తూ ప్ర‌తాపం చూపుతున్న వైర‌స్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏపీ ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ మేర‌కు మ‌రో వ్యూహాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య,ఆరోగ్యశాఖ ‘కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ను రూపొందించి శనివారం విడుదల చేసినట్లు తెలిపింది. జ్వరం, దగ్గు, శ్వాస వంటి లక్షణాలతో మెడికల్ షాపులకొచ్చే వారి వివరాల్ని ఈ యాప్‌లో పొందుపర్చాలని మెడికల్‌ షాపు యజమాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు స్వయంగా చికిత్స అందిస్తారని తెలిపింది. ఇక మెడికల్‌ షాపుల యజమానులు తమ మొబైల్‌ నంబర్‌ ద్వారా ఈ యాప్‌లోకి లాగిన్‌ అవ్వాలని పేర్కొంది. లాగిన్‌ అయ్యాక మొబైల్‌ నంబర్‌ లేదా మెడికల్‌ షాపు ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేయాలని ఆరోగ్య శాఖ సూచించింది.