షాకింగ్ న్యూస్ః మర్కజ్ తరహాలో మరో ఘటన..

|

Apr 14, 2020 | 6:20 AM

దేశంలో క‌రోనా వ్యాప్తికి అజ్యం పోసిన సంఘ‌ట‌న ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లేన‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇదే తరహాలో ఇప్పుడు మరో మసీదు ఘటన కలకలం రేపుతోంది. ఆ ప్రార్థ‌న‌ల తాలూకు ఆన‌వాళ్లు..

షాకింగ్ న్యూస్ః మర్కజ్ తరహాలో మరో ఘటన..
Follow us on

దేశంలో క‌రోనా వ్యాప్తికి అజ్యం పోసిన సంఘ‌ట‌న ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌లేన‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మసీదులో ప్రార్థనల ఘటన సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ మత సమావేశాలకు హాజరైన వారి కారణంగా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు కరోనా విస్త‌రించింది.  తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల‌పై కోవిడ్ ప్ర‌భావం ప‌డింది.  నాలుగైదు రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. ఇదే తరహాలో ఇప్పుడు మరో మసీదు ఘటన కలకలం రేపుతోంది. ఆ ప్రార్థ‌న‌ల తాలూకు ఆన‌వాళ్లు తెలంగాణ‌లోని నిజ‌మాబాద్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చాయి.

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 13న రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల ట్రావెల్ హిస్టరీ గురించి ఆరా తీయగా.. వీరిద్దరూ యూపీలోని దియోబంద్‌ మసీదులో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లుగా తేలింది. వీరితో పాటు మరో 20 మంది వరకూ ఇదే మసీదుకు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యిమందికి పైగా ఈ మ‌త‌ప్రార్థ‌న‌ల‌కు వెళ్లినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా మ‌రోమారు ఆందోళ‌న మొద‌లైంది. వీరంతా దియోబంధుతో పాటు అజ్మీర్ దర్గాను కూడా సందర్శించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన రాష్ట్ర ప్రభుత్వం.. దియోబంధుదియోబంద్‌ మసీదుకు వెళ్లొచ్చిన వారి సమాచారాన్ని సేకరించాలని  అధికారులను ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ మర్కజ్ మసీదులో ప్రార్థనలు నిర్వహించిన తబ్లిగీ జమాత్ కార్యకర్తలే ఆ సమావేశాల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు వెళ్లినట్లు సమాచారం. నిజాముద్దీన్ తరహాలోనే యూపీలో ప్రార్థనలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ నుంచి పెద్ద సంఖ్యలో రాజస్థాన్‌లోని ఆజ్మీర్ దర్గాను సందర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కేంద్రం.. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.