టిక్​టాక్ బ్యాన్‌పై పిల్..వారికి హైకోర్టు షాక్..!

|

Apr 26, 2020 | 1:16 PM

టిక్‌టాక్‌పై గ‌తకొద్ది రోజులుగా తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టిక్ టాక్‌లో వీడియోలు అభ్యంతరకరంగా ఉంటున్నాయ‌ని, వాటిని తొలగించాలని కోరుతూ కొంద‌రు కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

టిక్​టాక్ బ్యాన్‌పై పిల్..వారికి హైకోర్టు షాక్..!
Follow us on
టిక్​టాక్.. యువతను ఊపేస్తున్న యాప్. కొందరు టైంపాస్​కు వీడియోలు పెడుతుంటే, మరికొందరు తమలోని ట్యాలెంట్​నంతా బయటపెట్టేందుకు ఇదే మంచి వేదిక అనుకుంటున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అంతలా అందరికీ చేరువైంది ఆ యాప్​. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఆ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోగా, అందులో మన దేశమే ముందుండడం విశేషం. ఒక్క ఇండియాలోనే దాదాపు 46.68 కోట్ల మంది టిక్​టాక్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ టిక్‌టాక్‌పై గ‌తకొద్ది రోజులుగా తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టిక్ టాక్‌లో వీడియోలు అభ్యంతరకరంగా ఉంటున్నాయ‌ని, వాటిని తొలగించాలని కోరుతూ కొంద‌రు కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.
తాజాగా, ఏప్రిల్ 9న ఓ లాయర్ టిక్ టాక్ కస్టమర్ సపోర్ట్ టీమ్‌కు ఈ మెయిల్ ద్వారా  ఓ ఫిర్యాదు చేశారు. టిక్ టాక్‌లో వీడియోలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆ మెయిల్‌లో కోరారు. ఈ మేర‌కు టిక్ టాక్‌ను నిషేధించాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనాపై తప్పుడు ప్రచారానికి టిక్ టాక్ బాగా వీలు కల్పిస్తోందని స‌ద‌రు న్యాయ‌వాది పిల్‌లో వివరించారు. టిక్ టాక్ యూజర్లందరూ ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వీడియోలు క్రియేట్ చేసి పెడుతున్నారని లేఖ రాశారు. న్యాయవాది లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ట్రాయ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.