ఆర్మీలో కరోనా టెన్షన్‌..110 మంది సిబ్బందికి పాజిటివ్‌

| Edited By:

Jul 19, 2020 | 6:44 AM

దేశ రక్షణ వ్యవస్థలో కూడా కరోనా టెన్షన్ ఎక్కువైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల మంది సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా డెహ్రాడూన్‌లో 110 మంది భారత ఆర్మీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని..

ఆర్మీలో కరోనా టెన్షన్‌..110 మంది సిబ్బందికి పాజిటివ్‌
Follow us on

దేశ రక్షణ వ్యవస్థలో కూడా కరోనా టెన్షన్ ఎక్కువైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేల మంది సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా డెహ్రాడూన్‌లో 110 మంది భారత ఆర్మీ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. గడిచిన రెండు మూడు రోజులుగా వదంకు పైగా పాజిటివ్ కేసులు
నమోదయ్యాయన్నారు. పాజిటివ్‌గా తేలిన ఆర్మీ సిబ్బంది కాంటాక్ట్‌ కేసులను కూడా గుర్తిస్తున్నామని.. వెంటనే ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 1,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 3,021 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 51 మంది మరణించారు.