‘పెళ్లి తర్వాత.. నీ భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే ఏం చేస్తావ్?’.. ఫైనల్ HR రౌండ్‌లో యువతికి ఊహించని ప్రశ్న

ఓ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో సుమారు 70 శాతం మంది పురుషులు కాగా.. 30 శాతం మంది మహిళలు ఉన్నారు. వివిధ దశల ఇంటర్వ్యూల తర్వాత చివరకు ముగ్గురు యువకులు, ఒక యువతి ఫైనల్ హెచ్‌ఆర్ రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ కంపెనీకి చెందిన టీమ్ లీడర్లు, డైరెక్టర్లు అభ్యర్థులతో మాట్లాడుతూ..

‘పెళ్లి తర్వాత.. నీ భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే ఏం చేస్తావ్?’.. ఫైనల్ HR రౌండ్‌లో యువతికి ఊహించని ప్రశ్న
Woman Faces Unexpected Question in Final HR Round

Updated on: Aug 28, 2026 | 4:38 PM

ఇంటర్వ్యూ అంటే కేవలం చదువులో సాధించిన మార్కులు, విద్యార్హతలు మాత్రమే కాదు.. అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్యలను ఎదుర్కొనే తీరు, సమయస్ఫూర్తి, మానసిక పరిపక్వతను కూడా పరీక్షించే ప్రక్రియగా మారుతోంది. ముఖ్యంగా హెచ్‌ఆర్‌ రౌండ్‌లో అభ్యర్థి క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడో తెలుసుకునేందుకు కొన్ని సందర్భాల్లో ఊహించని ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. అలాంటి ఓ ఇంటర్వ్యూలో ఒక యువతికి ఎదురైన ప్రశ్న, ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఫైనల్ HR రౌండ్‌లో ముగ్గురు యువకులు.. ఒక యువతి

ఓ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో సుమారు 70 శాతం మంది పురుషులు కాగా.. 30 శాతం మంది మహిళలు ఉన్నారు. వివిధ దశల ఇంటర్వ్యూల తర్వాత చివరకు ముగ్గురు యువకులు, ఒక యువతి ఫైనల్ హెచ్‌ఆర్ రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ కంపెనీకి చెందిన టీమ్ లీడర్లు, డైరెక్టర్లు అభ్యర్థులతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు వారి ప్రతిభ, స్పాంటేనిటీ, పనితీరును పరిశీలించామని తెలిపారు. ఇక చివరి దశలో వారి మానసిక స్థితి, ఆలోచనా విధానం, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునే సామర్థ్యంను పరీక్షిస్తామని చెప్పారు. దీంతో అభ్యర్థులంతా ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు.

యువతిని ఇబ్బందిపెట్టిన ప్రశ్న

ఇంటర్వ్యూలో భాగంగా అభ్యర్థులకు కొంత గందరగోళానికి గురిచేసే విధంగా ఊహించని ప్రశ్నలు అడిగారు. మొదట కొంత భయపడినప్పటికీ ఆ యువతి మాత్రం ఆ తర్వాత తేరుకుని.. ప్రశ్న ఏదైనా ప్రశాంతంగా ఆలోచించి సమాధానం ఇవ్వాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు ఇంటర్వ్యూయర్ ఆమెను ఒక ఊహాత్మక ప్రశ్న అడిగాడు. అదేంటంటే..

ఇవి కూడా చదవండి

‘నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత.. నీ భర్త సంసారానికి పనికిరాడని తెలిస్తే నువ్వు ఎలా స్పందిస్తావు?’

అని ప్రశ్నించాడు.

ఊహించని ఈ ప్రశ్నకు మొదట ఆమె ఒక్క క్షణం ఏం సమాధానం చెప్పాలో ఆలోచించింది. కానీ ఆ తర్వాత వెంటనే తేరుకుని తన ఆలోచనను స్పష్టంగా వివరించింది.

యువతి దిమ్మతిరిగే సమాధానం ఇదే..

అలాంటి పరిస్థితి ఎదురైతే ముందుగా తన భర్తతో మాట్లాడి అసలు సమస్య ఏమిటో పూర్తిగా తెలుసుకుంటానని ఆమె చెప్పింది. పెళ్లికి ముందు ఈ విషయం తనకు తెలియలేదా? అనే విషయాన్ని కూడా తెలుసుకుంటానని పేర్కొంది. ఆ తర్వాత వైద్య నిపుణుడిని సంప్రదించి, అవసరమైతే సంబంధిత స్పెషలిస్ట్ వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్, చికిత్స అందించే ప్రయత్నం చేస్తానని చెప్పింది. అయినా సమస్య పరిష్కారం కాకపోతే.. భర్తతో తన భావాలను, బాధను వివరంగా మాట్లాడతానని తెలిపింది. ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగడం సాధ్యం కాకపోతే మ్యూచువల్‌గా విడిపోవడాన్ని కూడా ఆలోచిస్తానని చెప్పింది. అయితే ఈ విషయాన్ని అందరి ముందు చెప్పి భర్త వ్యక్తిత్వానికి, గౌరవానికి భంగం కలిగించడం తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేసింది. అతనిపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకుంటానని పేర్కొంది. ఒకవేళ ఆ వ్యక్తికి తన తప్పు తెలిసి పశ్చాత్తాపం కలిగితే.. ఇద్దరూ కలిసి ఒక అనాథాశ్రమం నుంచి ఓ చిన్నారిని దత్తత తీసుకుని తమ బిడ్డలా పెంచుకోవచ్చని కూడా ఆమె చెప్పింది. ‘నా భర్త నాకు స్నేహితుడిలా, గైడ్‌లా, మెంటర్‌లా ఉంటే అంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు’ అనే భావనతో కలిసి ఉంటామని ఆమె తన సమాధానాన్ని ముగించింది.

ఆ సమాధానంతో ఇంటర్వ్యూ ప్యానెల్‌ ఫిదా..

యువతి ఇచ్చిన సమాధానం ఇంటర్వ్యూ ప్యానెల్‌ను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లిష్టమైన ప్రశ్న ఎదురైనప్పుడు కంగారుపడకుండా.. సమస్యను అర్థం చేసుకోవడం, పరిష్కారం కోసం ప్రయత్నించడం, ఎదుటి వ్యక్తి భావాలను గౌరవించడం వంటి అంశాలను ఆమె సమాధానంలో ఇంటర్వ్యూయర్లు గుర్తించారు. ఆమె మెచ్యూరిటీ, ఓర్పు, సమయస్ఫూర్తి, సమస్యను పరిష్కరించాలనే ఆలోచనా విధానం నచ్చడంతో చివరకు ఆమెను ఉద్యోగం వరించింది. ఈ ఘటన చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పడం కంటే, ఒక్క క్షణం ఆలోచించి, పరిస్థితిని అర్థం చేసుకుని సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం. జీవితంలోనూ అంతే.. కంగారులో, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలను మరింత పెంచుతాయి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం సరైన దారిని చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ, జీవితంలోనూ సమయస్ఫూర్తితో పాటు సహనం, పరిపక్వమైన ఆలోచనా విధానం ఎంతో కీలకం.

Loading...
Unable to load recommendations.
Follow Us