చుక్కలు చూపించిన UPSC సివిల్స్‌ 2026 ప్రిలిమినరీ పరీక్ష.. కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్!

UPSC Prelims 2026 Cutoff: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఆదివారం (మే 24) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష రాయడానికి మొత్తం 44,205 మంది అభ్యర్థులు నమోదుచేసుకుంటే.. వీరిలో పేపర్‌ 1కు 29,609 మంది, పేపర్‌ 2కు 29,262 మంది మాత్రమే హాజరయ్యారు. దాదాపు 14,943 మంది పరీక్షకు హాజరుకాలేదు..

చుక్కలు చూపించిన UPSC సివిల్స్‌ 2026 ప్రిలిమినరీ పరీక్ష.. కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్!
UPSC Prelims Analysis And Cutoff Prediction

Updated on: May 25, 2026 | 9:49 AM

హైదరాబాద్‌, మే 25: దేశ వ్యాప్తంగా ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారికి క్వశ్చన్‌ పేపర్ చూడగానే చుక్కలు కనిపించాయి. అందుకు కారణం ఈసారి పరీక్ష గత నాలుగేళ్లతో పోల్చితే అత్యంత కఠినంగా వచ్చింద అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులంతా క్వశ్చన్‌ పేపర్‌లో కఠిన ప్రశ్నలు ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురొన్నట్లు తెలిపారు. ముఖ్యంగా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ (పేపర్‌ 1)లో వివిధ విభాగాల నుంచి ప్రశ్నలు అడిగినప్పటికీ కరెంట్‌ అఫైర్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. గవర్నెన్స్‌కు సంబంధిత ప్రశ్నలను కేస్‌ స్టడీ రూపంలో అడగడం వల్ల ప్రశ్నలు చాలా పొడవుగా ఉండి, ఎక్కువ సమయాన్ని తీసుకోవల్సి వచ్చిందని వాపోయారు. పేపర్‌ 1లో మొత్తం 100 ప్రశ్నలు ఉండగా.. వాటిలో 27 ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌, 19 చరిత్ర, సంస్కృతి, 12 భారత రాజ్యాంగం, పాలన, 11 పర్యావరణం, జీవావరణ శాస్త్రం, 10 ఆర్థిక, సామాజిక అభివృద్ధి, 8 సాధారణ విజ్ఞానం, 7 సాధారణ జ్ఞానం, 6 భూగోళ శాస్త్రం నుంచి వచ్చాయి.

ఈ ఏడాది అడిగిన ప్రశ్నల ధోరణి కోచింగ్‌ సెంటర్లకు మించి స్వయానా కోచింగ్‌ నిపుణులే చెప్పడం విశేషం. ప్రామాణిక వనరుల నుంచి కరెంట్‌ అఫైర్స్‌ను నిరంతరం అధ్యయనం చేసినవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రశ్నలు రూపొందించినట్లు తెలిపారు. ఇక పేపర్‌ 2లో వచ్చే సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీఎస్‌ఏటీ) మాత్రం గతంతో పోలిస్తే కాస్త తేలికగా ఉందని అభ్యర్థులు పేరొన్నారు. నిజానికి యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో పేపర్‌ 2లో కనీస అర్హత మార్కులు తెచ్చుకున్నవారికి మాత్రమే పేపర్1 వాల్యుయేషన్‌ చేస్తారు. ఈసారి పేపర్‌ 2లో కమ్యూనికేషన్‌ సిల్స్‌, ఇంటర్‌ పర్సనల్‌ సిల్స్‌పై ప్రశ్నలు రావడం విశేషం. కాంప్రిహెన్షన్‌, మ్యాథమెటిక్స్‌ విభాగం ప్రశ్నలు కూడా కాస్త తేలికగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది యూపీఎస్సీ మొత్తం 933 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. గత ఏడాది 979 పోస్టులు ఉన్నాయి. ఇక యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ ఫలితాలను జూన్‌ 10లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ పేపర్‌ కాఠిన్యం దృష్యా ఈసారి కటాఫ్‌ భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్ 2026 కట్‌ ఆఫ్‌ మార్కులు ఎంత ఉండే అవకాశం ఉందంటే..

  • జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు: 78
  • ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు: 73
  • ఓబీసీ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు: 77
  • ఎస్సీ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు: 70
  • ఎస్టీ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు: 68

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us