84 సబ్జెక్ట్‌లకు UGC NET 2026 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

యూజీసీ జూన్‌ సెషన్‌కు సంబంధించిన యూజీసీ నెట్‌ 2026 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్‌ వివరాలను నమోదు చేసి స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 84 సబ్జెక్టుల ఫలితాలను..

84 సబ్జెక్ట్‌లకు UGC NET 2026 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
UGC NET Result Released

Updated on: Aug 29, 2026 | 2:33 PM

హైదరాబాద్‌, ఆగస్ట్ 29: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జూన్‌ సెషన్‌కు సంబంధించిన యూజీసీ నెట్‌ 2026 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్‌ వివరాలను నమోదు చేసి స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 84 సబ్జెక్టుల ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైనల్‌ కీలను కూడా ఇప్పటికే ఎన్టీయే అందుబాటులో ఉంచింది.

UGC NET 2026 స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరోవైపు ఇంగ్లిష్‌, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల పరీక్షల తేదీలను కూడా ఎన్టీయే ప్రకటించింది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో మళ్లీ నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ సబ్జెక్టుల కోసం నిర్వహించిన పరీక్షలను రద్దు చేశామని, ఈ మూడు సబ్జెక్టుల పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపింది. అందువల్లనే రిజల్ట్స్‌లో స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించే అభ్యర్ధులకు ఈ మూడు సబ్జెక్ట్‌ పరీక్షలు రాసిన వారు ఇన్‌వాలిడ్‌ అప్లికేషన్‌, పాస్‌ వర్డ్‌ అనే మెసేజ్‌ కనిపిస్తుందని ఎన్టీయే వివరించింది. ఈ అభ్యర్ధులకు రీటెస్ట్‌ తర్వాత మాత్రమే స్కోర్ కార్డు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

కాగా ఇటీవల యూజీసీ నెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జరగగా.. అందులో ఇంగ్లిష్‌, కామర్స్‌, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లలో లెక్కకు మించి తప్పులు దొర్లడంతో ఎన్టీయే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. టైపింగ్‌, ట్రాన్స్‌లేషన్‌ సంబంధిత తప్పులు దొర్లినట్లు ఎన్టీయే పొరబాటును అంగీకరించింది. ఈ క్రమంలో ఈ మూడు సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి.. తిరిగి నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇతక సందేహాల నివృత్తికి ఎన్‌టీఏ హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించాలని సూచించింది.

UGC NET 2026 స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us