TGSRTC Jobs 2026: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGRTC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు తాజాగా ప్రారంభమైనాయి...

TGSRTC Jobs 2026: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం! డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TSRTC TST and MST Recruitment 2025 Notification

Updated on: Jan 03, 2026 | 10:04 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ), మెకానికల్ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) ఉద్యోగాల భర్తీకి ఇటీవల తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGRTC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు తాజాగా ప్రారంభమైనాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 198 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఇందులో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ (టీఎస్‌టీ) పోస్టులు 84, మెకానికల్ సూపర్‌వైజర్‌ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులు 114 వరకు ఉన్నాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ముఖ్యంగా పుట్టిన తేదీకి సంబంధించి మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. 2025 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థులకు), 1 ఏప్రిల్ 2025న లేదా ఆ తర్వాత జారీ చేసిన EWS సర్టిఫికెట్ (వర్తిస్తే) ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 1, 2025వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు మూడేళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 20, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.800, ఎస్టీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఆర్టీసీ టీఎస్‌టీ, ఎంఎస్‌టీ ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.