TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

TS Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గత నెల 13 నుంచి 21 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 889 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 3,98,358 మంది హాజరయ్యారు..

TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Ts Inter Supplementary Results

Edited By:

Updated on: Jun 11, 2026 | 5:08 PM

TS Inter Supplementary Results 2026: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మే 13 నుంచి మే 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా 889 కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. బోర్డు కేవలం 17 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో అత్యంత వేగంగా జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఈ రోజు ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ మార్కుల వివరాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు అయిన tgbie.cgg.gov.in, results.cgg.gov.in లలో చెక్ చేసుకోవచ్చని బోర్డు సెక్రటరీ అభిలాషా అభినవ్ తెలిపారు.

ఈ ఏడాది ఫలితాలలో కూడా ఎప్పటిలాగే అబ్బాయిల కంటే అమ్మాయిలే అత్యుత్తమ ఉత్తీర్ణత శాతంతో పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కలిపి మొత్తం 2,67,331 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 68.84% (1,84,042 మంది) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు 76.10% ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 62.57% మాత్రమే పాస్ అయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరంలో మొత్తం 1,31,128 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 49.29% (64,639 మంది) విజయం సాధించారు. సెకండ్ ఇయర్ ఫలితాలలో సైతం అమ్మాయిలు 52.56% ఉత్తీర్ణతతో, అబ్బాయిల (47.45%) కంటే ముందంజలో నిలిచారు.

గ్రూపుల వారీగా చూస్తే మే/జూన్ 2026 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎంపీసీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్‌లో 78.57%, సెకండ్ ఇయర్‌లో 50.45% ఉత్తీర్ణతతో టాప్‌లో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బీపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపుల విద్యార్థులు నిలిచారు. గత మూడేళ్ల (2024, 2025, 2026) ఫలితాల సరళిని పరిశీలిస్తే, ఇటు జనరల్ అటు ఒకేషనల్ స్ట్రీమ్స్ రెండింటిలోనూ గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా మెరుగుపడటం విశేషం. విద్యార్థులు తమ షార్ట్ మెమోలను వెబ్‌సైట్ నుండి కలర్ ప్రింట్ తీసుకోవాలని, వీటికి భౌతిక కాపీలు విడిగా ఇవ్వబడవు కాబట్టి పాస్ సర్టిఫికెట్ వచ్చే వరకు భద్రపరుచుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.

ఫలితాల తర్వాత మార్కుల రీకౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు బోర్డు అవకాశం కల్పించింది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 12 నుండి జూన్ 18 వరకు ఆన్‌లైన్ ద్వారా రీకౌంటింగ్ కోసం పేపర్‌కు రూ. 100/-, రీ-వెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ కోసం పేపర్‌కు రూ. 800/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో, ఫలితాల తదుపరి ఒత్తిడి లేదా ఆందోళనలకు గురయ్యే విద్యార్థుల కోసం బోర్డు 2500 కాలేజీల్లో కౌన్సిలర్లను అందుబాటులో ఉంచింది. మానసిక నిపుణుల సలహాల కోసం విద్యార్థులు ‘టెలి-మానస్’ టోల్ ఫ్రీ నంబర్ 14416 కు లేదా ఇతర ఫిర్యాదుల కొరకు హెల్ప్ డెస్క్ నంబర్ 9240205555 కు సంప్రదించవచ్చని బోర్డు సూచించింది.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ నుండి తమ తెలంగాణ బోర్డ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2026ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించాలి.

  • TGBIE అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో, ‘TG Inter 1st/ 2nd year supply result 2026’ పై క్లిక్ చేయండి.
  • హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • సబ్మిట్ చేయగానే, మార్క్‌షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనిని ప్రింట్‌ తీసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us