
తెలంగాణలో న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను టీజీ లాసెట్ (TG LAWCET), టీజీ పీజీ లాసెట్ (TG PGLCET) నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీయే ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. 3 ఏళ్ల ఎల్.ఎల్.బి, 5 ఏళ్ల ఎల్.ఎల్.బి కోర్సులతో పాటు రెండేళ్ల ఎల్.ఎల్.ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే:
తెలంగాణ లాసెట్‌కు సంబంధించి ఫిబ్రవరి 8, 2026న నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 10 తేదీ నుంచి ఈ పరీక్ష ప్రేవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం కానున్నాయని.. అలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే మే 3 నుంచి 8 వ తేదీ వరకు దరఖాస్తులో ఏవైనా సవరణలు ఉంటే చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే మే 18న పరీక్ష జరగనుందని.. మే 12 నుంచే హాట్ టికెట్లు అందుబాటులో ఉండనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు:
అయితే మే 18న జరిగే ఈ పరీక్షలు మొత్తం మూడు సెషన్లలో నిర్వహించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 3 ఇయర్స్ కోర్సు కోసం మొదటి సెషన్ ఉదయం 09:30 నుండి 11:00 వరకు ఉంటుందని.. రెండవ సెషన్ మధ్యాహ్నం 12:30 నుండి 02:00 వరకు ఉంటుందని స్పష్టం చేశారు. 5 ఇయర్స్ కోర్సు అండ్ LL.M అభ్యర్థులకు సాయంత్రం 04:00 నుండి 05:30 వరకు పరీక్ష నిర్వహించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత మే 23న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. జూన్ 5న తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. అర్హత గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tsche.ac.in సందర్శించవచ్చని తెలిపారు
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.