TG Inter Results 2025: మరికాసేపట్లో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. ఈ మేరకు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా..

TG Inter Results 2025: మరికాసేపట్లో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్‌ ఇదే
TG Inter Results 2025

Updated on: Apr 22, 2025 | 12:47 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌. ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలకానున్నాయి. ఈ మేరకు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరవుతారని ఆయన తెలిపారు.

తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు

తెలంగాణ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌ తోపాటు టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లోనూ నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే ఐవీఆర్‌ పోర్టల్‌ 9240205555 ఫోన్‌నంబర్‌ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ కొనసాగింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us