TS Polycet: సోమవారం నుంచి పాలిసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే..

TS Polycet: తెలంగాణలో పాలిసెట్‌ - 2022 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను రేపటి నుంచి (సోమవారం) ప్రారంభించనున్నారు. మే 9న మొదలయ్యే ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 4తో ముగియనుంది. ఇక రూ. 100 ఆలస్య రుసుమతో జూన్‌ 5వరకు...

TS Polycet: సోమవారం నుంచి పాలిసెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. చివరి తేదీ ఎప్పుడంటే..
Ts Polycet 2022

Updated on: May 08, 2022 | 9:23 AM

TS Polycet: తెలంగాణలో పాలిసెట్‌ – 2022 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను రేపటి నుంచి (సోమవారం) ప్రారంభించనున్నారు. మే 9న మొదలయ్యే ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ జూన్‌ 4తో ముగియనుంది. ఇక రూ. 100 ఆలస్య రుసుమతో జూన్‌ 5వరకు అప్లై చేసుకోవచ్చని పాలిసెట్ కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. ఇక పాలిసెట్ పరీక్షను జూన్‌ 30 నిర్వహించనున్నారు.

12 రోజుల తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నట్లు శ్రీనాథ్‌ తెలిపారు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలతో పాటు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సుల సీట్లను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం www.polycet.telangana.gov.in, polycets.nic.in వెబ్‌సైట్‌లను సందర్శించండి.

ఆర్జీయూకేటీలో సీట్ల భర్తీ పాలిసెట్‌ ద్వారానే..

బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)లో సీట్లను సాధారణంగా ప్రభుత్వ పాఠశాల్లలోని విద్యార్థులు సాధించిన పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారనే విషయం తెలిసిందే. అయితే గతేడాది ఎస్సెస్సీ పరీక్షలు జరగకపోవడంతో పాలిసెట్‌ ర్యాంక్‌ల ద్వారా సీట్లను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పాలిసెట్‌ ద్వారానే ఆర్జీయూకేటీ సీట్లను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us